ఒకరికి తెలియకుండా ఒకరిని.. 8 మందితో పెళ్లి చేసుకున్నాడు..!

పెళ్లి అనేది జీవితంలో జరిగే ఓ ముఖ్యమైన ఘట్టం.. ఇది జీవితంలో ఒకేసారి చేసుకుంటారు.. కొన్నిసార్లు రెండు, మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు.. కానీ ఓ వ్యక్తి ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకున్నాడు.. ఒకరికి తెలియకుండా ఒకరితో కాపురం చేశాడు.. ఈ ఘటన హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతంలో వెలుగు చూసింది..

వివరాల మేరకు.. గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివ శంకర్ బాబు మ్యాట్రీమోనీ ద్వారా పలువురు యువతలను పరిచయం చేసుకున్నాడు. పెళ్లయి విడాకులు తీసుకున్న యువతులనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలా ఒకరికి తెలియకుండా ఒకరిని 8 మంది యువతులతో పెళ్లి చేసుకున్నాడు. 

తాను ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, తనకు వాళ్లతో ఎక్కువ సేపు గడిపే టైమ్ ఉండదని పెళ్లికి ముందే వారితో చెప్పేవాడు. ఎలాగోలా వారిని పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లి అయిన తర్వాత అవసరాల కోసమని వారి వద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకొని వెళ్లిపోయాడు.. ఆ మొత్తాన్ని జల్సాల కోసం, మరో మహిళకు ఇవ్వడానికి వాడుతాడు. ఈక్రమంలో మరో పెళ్లి చేసుకోడానికి రెడీ అవుతాడు. 

ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకొని ఒకే కాలనీలో పక్క పక్క వీధుల్లో కాపురం పెడతాడు. ఆఫీస్ షిఫ్ట్ పేరుతో ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరకు వెళ్తాడు. ఇలా కొండాపూర్ లో కాపురం పెట్టిన ఓ మహిళకు అనుమానం వచ్చి నిలదీయడటంతో అసలు విషయం బయటపడింది. ఈనెల 7న అతడు కనిపించకుండాపోయాడు. ఫోన్ చేసినా.. ఎక్కడ వెతికినా ఎలాంటి ఆచూకీ లేదు.. 

దీంతో బాధితురాలు గచ్చిబౌలి పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసింది. అతని గురించి ఆరా తీయగా.. 8 మంది బాధితుల వివరాలు తెలిశాయి.  పెళ్లి పేరుతో మోసం చేసి దాదాపు వారి వద్ద నుంచి రూ.60 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు ఇద్దరు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన శివశంకర్ ని కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అయితే మోసపోయిన యువతులు అందరూ ఉన్నత విద్య అభ్యసించినవారే.. అలాంటి వారినే బుట్టలో వేసుకొని అందిన కాడికి దోచుకున్నాడు.

Leave a Comment