సీఎం సార్.. మా రోడ్లను పట్టించుకోండి.. పవన్ కళ్యాణ్ కొత్త క్యాంపెయిన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.. #GoodMorningCMSir అనే హ్యాట్ ట్యాగ్ తో వైసీపీని టార్గెట్ చేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు.. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేశారు. ఈ వీడియోలో కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి క్లియర్ గా తెలుస్తోంది. కారులో వెళ్తూ ఈ వీడియో తీశారు.. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు. 

ఇక మరో ట్వీట్ లో సీఎం జగన్ పై సెటైరికల్ కార్టూన్లు పెట్టారు. సీఎం జగన్ హెలికాప్టర్ లో వెళ్తున్నట్లు, సాధారణ జనం రోడ్లపై వెళ్తూ నరకం అనుభవిస్తున్నట్లు కార్టూన్లు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సీఎం సార్.. మా రోడ్లను కాస్త పట్టించుకోరూ.. అని సీఎం ని ఓ వ్యక్తి అడుగుతున్నట్లు ఉంది..  

Leave a Comment