కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదా? ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. త్వరలో థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈనేపథయంలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. అయితే చాలా మంది కరోనా టీకా తీసుకోకుండా బయట తిరుగుతున్నారు. అయితే వారు అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లపై ఇటీవల జరిపిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యాక్సిన తీసుకోకపోతే కరోనా బారిన పడే అవకాశం ఉందని తేలింది. 

యూస్ హెల్త్ ఏజెన్సీ సీడీసీ ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనం ప్రకారం టీకా తీసుకోని వ్యక్తుల్లో కొవిడ్ వచ్చే అవకాశాలు 29 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇన్ ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరే ప్రమాదం 29.2 రెట్లు ఎక్కువగా ఉంటుందట.. ప్రస్తుతం డెల్టా వేరియంట్ విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీకా అవసరం చాలా ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

ఇక వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే టీకా తోసుకున్న వారికి సంక్రమణ ప్రమాదం 60 తగ్గుతుందని యూకే ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇప్సోస్ మోరీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ డేటా ప్రకారం ఫైజర్ వ్యాక్సిన్, కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారికి ఆస్పత్రిలో చేరకుండా 96 శాతం ప్రభావవంతంగా ఉందని తేలింది. కరోనా నుంచి రక్షణ పొందేందుకు వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవాలని సీడీసీ పరిశోధకులు చెబుతున్నారు. 

Leave a Comment