Farts selling online: పిత్తులు అమ్ముతూ లక్షలు సంపాస్తుంది..!

ఓ మహిళ తన పిత్తులను అమ్ముకుంటూ లక్షల్లో సంపాదిస్తుంది.. ఏంటీ నమ్మడం లేదా? కానీ ఇది నిజం.. అమెరికాకు చెందిన యూట్యూబర్ లష్ బొటానికా అనే మహిళ తన ఫార్ట్ లను ఆన్ లైన్ లో విక్రియించి ఇప్పటి వరకు రూ.18 లక్షలు సంపాదించింది.

అయితే ఇది ఆమె కావాలని చేయలేదు. ఆన్ లైన్ లో లైవ్ లో ఉండగా ఫార్ట్(బాంబు) వేయాలని ఆమెను కొందరు కోరారు. దీంతో లైవ్ లో ఆమె ఫార్ట్ వేసింది. ఆ వీడియో ఆమెకు బాగా పాపులారిటీ తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి దీన్నే బిజినెస్ గా చేసుకుని డబ్బులు సంపాదిస్తుంది. అంతేకాదు ఫార్ట్ క్వీన్ ఆఫ్ ది ఇంటర్నెట్ గా తనకు తాను ప్రకటించుకుంది. 

ఆమెకు ఫార్ట్ వేయాలని రిక్వెస్టులు వస్తుండటంతో అలా చేస్తుందట.. ఆమెతో డబ్బులు ఇచ్చి మరీ అలా చేయించుకుంటున్నారట.. ఆ పిత్తులు క్వాలిటీగా రావడం కోసం ఆమె తన డైట్ లో మార్పులు చేసుకుంది. రకరకాల వేరియంట్లలో ఆమె ఫార్ట్ వేస్తుంది. ఇక సౌండ్ బాగా రావడానికి ఆ ప్రదేశంలతో ఒక మైక్రో ఫోన్ కూడా పెట్టుకుంటుందట.. ఒక పిత్తుకు ఆమెకు రూ.13 వేలు వస్తాయట. ఇప్పటి వరకు మొత్తంగా ఆమె రూ.18.5 లక్షలు సంపాదించింది. ఈ పనిని ఆమె చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటుంది.

Leave a Comment