ఉదయం నిద్రలేవగానే టీ తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..!

ఉదయం నిద్ర లేవగానే టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిదా అంటే కాదని అంటున్నారు నిపుణులు.. ఉదయం టీ వంటి కెఫిన్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.  ఉదయం అల్పాహారం తీసుకున్నాక 1-2 గంటల తర్వాత టీ తాగడం ఉత్తమం అని సూచిస్తున్నారు. 

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగేవారికి అసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక కొంత మంది అయితే బ్రష్ చేయకుండానే టీ తాగుతుంటారు. అలా తాగటం వల్ల నోటిలో చెబు బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్లి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది మీ గట్ లో మంచి బ్యాక్టీరియాతో కలిసి మీ జీవక్రియను భంగం చేస్తుంది.   

అలాా తాగడం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉదయం టీ తాగడంతో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించాలి. ఉదయాన్నే టీ తాగడం వల్ల మీ మెటబాలిక్ సిస్టమ్ పై ప్రభావం పడుతుంది. 

మన జీవక్రియపై టీ ఎక్కువగా ప్రబావం చూపుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అల్సర్, హైపరాసిడిటీ సమస్యలు వస్తాయి. స్కెలిటల్ ప్లోరోసిస్ అనే వ్యాధి బారినపడే అవకాశం కూడా ఉంది. ఈ వ్యాధి ఎముకలను బలహీనపరుస్తుంది. 

ఉదయం టీ తాగడం వల్ల మలబద్దకం సమస్య కూడా రావచ్చని నిపుణులు అంటున్నారు. ఉదయం అల్పాహారం తీసుకున్న ఒక గంట తర్వాత టీ తాగవచ్చిన చెబుతున్నారు. భోజనం తర్వాత 1-2 గంటల తర్వాత టీ లేదా కాఫీ తాగడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఖాళీ కడుపుతో మాత్రం తీసుకోవద్దని వారు సూచిస్తున్నారు. 

Leave a Comment