ఒక్క రోజులోనే 25 వేల కరోనా కేసులు..

భారత్ లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24,879 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 487 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,67,296కు చేరింది. 21,129 మంది కరోనా చనిపోయారు. 

ఎంఐటీ సర్వే నిజమవుతుందా?

ఇక దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదుకావడం ఆందోళనకు గురి చేస్తోంది.  కరోనా కేసులు రోజులు 20 వేలపైనే నమోదవుతున్నాయి. ఈ విధంగా కేసులు నమోదు కావడం చూస్తే మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) సర్వే నిజం అవుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఈ సర్వే ప్రకారం ఒక వేళ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రాకపోతే 2021 ఫిబ్రవరి నాటికి భారతదేశంలో రోజుకు 2.8 లక్షల కేసులు నమోదవుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 2021 మే నాటికి 25 కోట్ల పాజిటివ్ కేసులు నమోదవుతాయని పరిశోధకులు తేల్చారు.

ఏపీలో 1500 కేసులు నమోదు..

ఇటు ఏపీలోనూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21 వేలకు చేరింది.  కరోనాతో 277 మంది మరణించారు.  

Leave a Comment