ప్రాణాల మీదకు తెచ్చిన హస్తప్రయోగం.. ఊపిరితిత్తులకు చిల్లు.. చరిత్రలో ఇదే తొలిసారి..!

హస్తప్రయోగం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. హస్తప్రయోగం చేసుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్విట్జర్లాండ్ లోని వింటర్ థర్ నగరంలో ఓ 20 ఏళ్ల యువకుడు హస్తప్రయోగం చేసుకునే సమయంలో ఊపిరితిత్తులో ఇబ్బందులు తలెత్తింది. దీంతో శ్వాస తీసుకోలేక కుప్పకూలాడు. ఛాతిలో భరించలేని నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.. 

వైద్యులు అతడిని వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. ఆ యువకుడి ఊపిరితిత్తులకు చిల్లుపడి గాలి లీకై శరీరమంతా వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఇది ఎలా జరిగి ఉంటుందో తెలియనప్పటికీ యువకుల్లో ఇలాంటి సమస్యలు సాధారణమే అని వైద్యులు చెప్పారు. సెక్స్ చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైనా సందర్భాలు ఉన్నాయి కానీ, హస్తప్రయోగం చేసేటప్పుడు ఇలా జరిగిన దాఖలాలు లేవని వెల్లడించారు. హస్తప్రయోగం సమయంలో ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. 

ఆ యువకుడికి తేలికపాటి ఆస్థమాతో పాటు అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్నట్లు కాంటోనల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అస్థమాకు అతడు చికిత్స కూడా తీసుకోలేదని చెప్పారు. అయితే అతడికి డ్రగ్స్, స్మోకింగ్ వంటి అలవాట్లు లేవని యువకుడు చెప్పినట్లు వివరించారు. కాగా ఆ యువకుడిని నాలుగు రోజులు చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు చెప్పారు.

Leave a Comment