బాలిక కడుపులో 2 కిలోల వెంట్రుకలు..!

ఓ బాలిక జీర్ణాశయంలో 2 కిలోల వెంట్రుకలు పేరుకుపోయాయి. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు బాలిక కడుపులో వెంట్రుకలను సర్జరీ చేసి తొలగించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలింటి సర్జరీ కేవలం 68 మందికి మాత్రమే జరిగింది. 

వివరాల మేరకు హైదరాబాద్ నగరంలోని గగన్ పహాడ్ ప్రాంతానికి చెందిన పూజిత(17) గత ఐదు నెలలుగా తన తల వెంట్రుకలను మింగిస్తోంది. దీంతో అవి కడుపులో పేరుకుపోయాయి. మూడు నెలలుగా బాలికకు కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. దీంతో గతనెల 24న బాలికను ఆమె సోదరి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చింది. 

బాలికకు వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను హోం ఐసోలేషన్ లో ఉంచారు. మే 31న బాలిక కోవిడ్ నుంచి కోలుకుంది. దీంతో అదే రోజు ఆస్పత్రిలో చేర్చుకుని ఉదరభాగానికి పలు పరీక్షలు నిర్వహించారు. ఆమె కడుపులోని జీర్ణశయం నుంచి చిన్ని పేగు వరకు వెంట్రుకలు పేరుకుపోయినట్లు గుర్తించారు. 

ఈనెల 2న వైద్యులు పూజితకు శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె కడుపులో ఉన్న సుమారు 2 కిలోల వెంట్రుకలను తొలగించారు. ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యమై ఉంటే.. బాలిక ప్రాణాలకే ప్రమాదం జరిగేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వెల్లడించారు. బాలికను శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. 

 

Leave a Comment