సోనూ సూద్ అందిరికీ స్ఫూర్తి : చంద్రబాబు

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రముఖ నటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సోనూసూద్ సేవలను కొనియాడారు. కోవిడ్ సంక్షోభంలో సోనూసూద్ కరోనా బాధితులకు, ప్రజలకు అనేక విధాలుగా అండగా నిలిచారని, ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. సోనూసూద్ రియల్ హ్యామన్ బీయింగ్ అని, ప్రజలకు సేవ చేయడమే అందరి పరమార్థం అని నిరూపించారని తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 

చంద్రబాబు అందరికీ ఆదర్శం:సోనూసూద్

ఈ సమావేంలో సోనూసూద్ మాట్లాడుతూ.. ‘ సంక్షోభ సమయంలో చంద్రబాబునాయుడు అందరికీ ఆదర్శం. షూటింగ్ కోసం నేను హైదరాబాద్ వచ్చిప్పుడు.. ఇక్కడి అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాను. చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది. మీ విజన్ వల్లే ఇది సాధ్యమైంది. కోవిడ్ సమయంలో చంద్రబాబు ప్రజలకు అండగా నిలిచారు. నా సతీమణి ఆంధ్రాకు చెందినవారే. గోదావరి జిల్లా. నాకు ఏపీతో ఎప్పటినుంచో అవినాభావ సంబంధం ఉంది. అనేక తెలుగు సినిమాల్లో నేను నటించాను. కోవిడ్ వల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక మంది ఉపాధి కోల్పోయారు. కరోనా బాధితులను ఆదుకునే సమయంలో చంద్రబాబుగారితో పాటు అనేక మంది నాకు సహాయ సహకారాలు అందించారు.. సాయపడ్డారు. కోవిడ్ సంక్షోభం అందరికీ గుణపాఠం. బాధితులకు మానవత్వంతో నాకు చేతనైన సాయం అందించాను’ అని సోనూసూద్ తెలిపారు. 

 

Leave a Comment