ఆనందయ్య మందు విషయంలో జగపతిబాబుపై బాబు గోగినేని సెటైర్లు..!

కరోనాకు ఆనందయ్య అందించే ఆయుర్వేద మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆనందయ్య మందుకు నటుడు జగపతి బాబు కూడా మద్దతు ప్రకటించారు. ఆయుర్వేదం హానీ చేయదని, ప్రజలను కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చిందని తెలిపాడు. 

ఈనేపథ్యంలో హేతువాది బాబు గోగినేని జగపతి బాబును టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ‘అమ్మ నాటీ.. తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతి బాబుపై సెటైర్లు వేశారు. 

జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నారని, జూబ్లిహిల్స్ లో ఆస్పత్రి తెరవబోతున్నారని ఓ లోకల్ ఇంగ్లీష్ వెబ్ సైట్ లో వార్త వచ్చింది. ఆ వార్తను ఆధారంగా చేసుకుని బాబు గోగినేని జగపతి బాబుపై సెటైర్లు వేశారు. దీనిపై జగపతి బాబు ఎలా స్పందిస్తారో మరీ… 

Leave a Comment