లాక్ డౌన్.. దాని ప్రభావాలు..

కరోనా వైరస్ ఇప్పుడు అందరిని భయపెడుతున్న సమస్య. దీనిని అరికట్టేందుకు ప్రధాన మంత్రి 21 రోజుల లాక్ డౌన్ కూడా ప్రకటించారు. ఇది చాలా కఠినమైన నిర్ణయం. అయినా దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఇది చాలా అవసరం.

వైరస్ యొక్క వ్యాప్తని నియంత్రించేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని. అవసరమైతే లాక్ డైన్ ను ఇంకా పెంచాల్సిన అవసరం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలకు, సొసైటీపైన, మరియు ఎకానమీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన మంత్రి ఈ లాక్ డౌన్ ను ప్రకటించినప్పుడు ఇది ఒక క్లిష్టమైన కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ లా కనిపించింది. ప్రధాని తన ప్రసంగంలో లాక్ డౌన్ సమయంలో తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము. ప్రజలకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నామనే దానిని చెప్పలేదు. దీంతో ప్రజలు కొంత ఇబ్బందులకు గురవ్వాల్సి వచ్చింది.

 లాక్ డైన్ ప్రకటించడంతో ప్రజలు దుకాణాల ముందు క్యూ కట్టారు. తరువాత ప్రభుత్వం నిత్యావసరాలపై క్లారిటీ ఇచ్చింది. నిత్యావసరాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది. ఆలోచించాల్సిన అవసరం ఎమిటంటే లాక్ డైన్ ప్రకటించినప్పుడు ప్రభుత్వం ప్రజల ఆహారం గురించి ఆలోచించదా మరీ.

నిత్యావసరాల విషయంలో నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై పెట్టింది. నిత్యావసరాల కొనుగోలు విషయంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో సమయాన్ని నిర్ణయించింది. ఢిల్లీ కర్ణాటక వంటి రాష్ట్రాలు 24/7 ను ప్రకటించగా, మరికొన్న రాష్ట్రాలు కేవలం మూడు గంటలే పెట్టాయి. ఇది ఒక తప్పు నిర్ణయం. తక్కువ సమయం పెట్టడంతో ప్రజలు గుమిగూడే అవకాశం ఉంది. ఇది ఎంత ప్రమాదకరమో గ్రహించాలి. 

ఆంధ్రప్రదేశ్ కూడా మొదట్లో ఉదయం 9 గంటల వరకు మాత్రమే పెట్టంది. ఆ తర్వాత ప్రజలు గుమిగూడడాన్ని గ్రహించి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాలు కొనుగోలు చేయవచ్చని ఆదేశించింది. 

దుకాణాదారులు కూడా వినియోగదారులకు సోషల్ డిస్టెన్స్ లో నెలబెట్టడం చాలా అవసరం. ప్రజలు కూడా దుకాణాల్లో వస్తులను ఎక్కువగా తాకవద్దు. ఒక సంచి పెట్టుకుని దానిని తన సామాన్లు వేయండి. తర్వాత చేతులు కడుకోవడం ఉత్తమం. 

డెలివరీ సంక్షోభం..

లాక్ డౌన్ సమయంలో ఫుడ్ మరియు గ్రాసరీ కంపెనీలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. బిగ్ బజార్, స్విగ్గి, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు తమ వేర్ హౌస్ లను మూసివేస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని తెరిచేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు. దీంతో వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గ్రాసరీస్ కు చెందిన లక్షల ట్రక్కులు  రాష్ట్రా సరిహద్దుల వద్దే నిలిచిపోయాయి. ట్రక్కు డ్రైవర్ల ఇబ్బందులు చెప్పలేనివి. దారిలో ఉన్న దాబాలు, రెస్టారెంట్లు అన్ని మూసివేయబడ్డాయి. దీంతో వారికి తినడానికి తిండి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డెలివరీ కంపెనీల ఎంప్లాయిస్ ని కూడా పోలీసులు అనుమతివ్వడం లేదు. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో ఎవరినీ అనుమతివ్వాలో, ఎవరిని అనుమతివ్వకూడాదో లోకల్ పోలీసులకు అవగాహన లేదు. కొన్ని ప్రభుత్వాలు వారిని డెలివరీ సమయంలో తమ ఐడీని వెంటబెట్టుకుని తిరగాలని సూచిస్తుంది. అయితే ఐడీ కార్డులేని వారి పరిస్థితి ఏంటి. ఇలాంటి ఎన్నో కేసులు మనకు కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఎవరు పని చేసేందుకు బయటకు వచ్చారు? ఎవరు ఖాళీగా తిరిగేందుకు వచ్చారని గుర్తించాల్సిన అవసరముంది. 

వర్క్ ఫ్రం హోమ్..

లాక్ డౌన్ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించాయి. అయితే ఇది కార్పొరేట్ సెక్టార్, ఫైనాన్షియల్ సెక్టార్ లో పని చేసే వారికి ఇది సులభం. అయితే ప్రొడక్షన్, మెయిన్ టెనెన్స్, కన్ స్ట్రక్షన్ కపెంనీల్లో పని చేస్తారో వారి పరిస్థితి ఏంటి. వీరు 20 లేదా 30 రోజులు పని చేయకపోతే వీరి కంపెనీలు మూత పడాల్సిన పరిస్థితి ఏర్పడతుంది. అలాంటప్పుడు వీరు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతుంది.  కోసం చాలా ప్రభుత్వాలు వీరికి నెలకు కొంత మొత్తం జమా చేయాలని నిర్ణయించాయి. 

డైలీ వేజ్ లేబర్స్ ..

మన ఇండియాలో దాదాపు 80 శాతం మంది రోజువారి వేతన కార్మికులు ఉన్నారు. వారికి పని చేస్తే కాని పూట గడవదు. ఇలాంటి వారికి 20 లేదా 30 రోజులు పని లేకపోతే వారు ఆకలికేకలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పట్టణాల నుంచి తమ గ్రామాలకు వెనుతిరుగుతున్నారు. ఎందుకంటే వీరు ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు వారి స్వంత గ్రామాలకు పయనమవుతున్నారు. అలాంటి వారిని కూడా సరిహద్దుల వద్ద ప్రభుత్వాలు ఆపేస్తున్నాయి. అలాంటి వారి కోసం కొంత మంది దాతలు ముందుకొచ్చి ఆదుకుంటున్నారు. 

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని బంద్ ఉన్నాయి. ఇలాంటి వారికి ఆ పాఠశాల్లో షెల్టర్ ఇస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

ఆర్థిక ప్యాకేజీలు..

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉచిత రేషన్ తో పాటు రూ.1000 ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1.7లక్షల కోట్ల  ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. రైతులకు రూ.2వేలు అకౌంట్ లో జమ చేస్తామని చెప్పింది. ఇదే కాకుండా మూడు నెలల పింఛన్ కూడా అందిస్తుందని ప్రకటించింది. మిగితా దేశాలు కరోనా వైరస్ వల్ల వచ్చిన ఈ ఆర్థిక సంక్షోభ స్థితిలో తమ ఆర్థిక వ్యవస్థ నిష్పత్తితో చూస్తే చాలా పెద్ద ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాయి. అలాంటప్పుడు కేంద్రం సాయం అందించడం మంచిదే అయినా అది చాలా తక్కువ అని చెప్పొచ్చు. 

 

 

 

 

Leave a Comment