చిన్న వయస్సులోనే లోకాన్ని వీడిన 15 నటులు.. ఎవరో తెలుసా?

పుట్టుక.. చావు.. ఈ రెండు మన చేతుల్లో ఉండవు.. మనిషి ఎప్పుడు చనిపోతాడో చెప్పలేం.. నిన్నటి వరకు మనతో ఉన్న వ్యక్తి తెల్లారేసరికి ఉంటాడో లేదో తెలీదు. మన దగ్గరి వారు దూరమైతే ఆ బాధ వర్ణణాతీతం. అయితే సినిమా నటులు ఎవరూ మనకు పరిచయం ఉండరు. కానీ వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పుడు ఎవరో మన సొంత వారు దూరమైన ఫీలింగ్ కలుగుతుంది. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు.. కానీ చిన్న వయస్సులోనే కొంత మంది నటులు ప్రాణాలు కోల్పోయారు. రకరకాల కారణాలతో వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అలా చిన్న వయస్సులోనే లోకాన్ని వీడిన తారల గురించి తెలుసుకుందాం.. 

1.సావిత్రి – 45 ఏళ్లు

అలనాటి తార సావిత్రి అద్భుత నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. కానీ కొన్ని అలవాట్ల కారణంగా అనారోగ్యంతో ఏడాది పాటు కోమాలో ఉన్నారు. ఏడాది తర్వాత ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె కేవలం 45 ఏళ్ల వయస్సులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

2.దివ్యభారతి – 19 ఏళ్లు  

దివ్యభారతి చాలా చిన్న వయస్సులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. చాలా తక్కువ కాలంలోనే మంచి స్టార్ డమ్ సంపాదించింది. చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. 1993లో ఒకరోజు పై అంతస్తులో ఉన్న తన నివాసంలో బాల్కనీలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మరణించింది. అప్పటికి దివ్యభారతి వయస్సు 19 సంవత్సరాలే..

3.సిల్క్ స్మిత – 35 ఏళ్లు

సినీ లవర్స్ కి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సిల్క్ స్మిత.. 80లలో అగ్రహీరోలతో కలిసి నటించి తన హాట్ హాట్ అందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. సిల్క్ స్మిత ఉందంటే చాలా ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే.. అయితే సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 

4.ప్రత్యూష – 20 ఏళ్లు

రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని మొదలైన సినిమాల్లో గుర్తించదగ్గ పాత్రల్లో ప్రత్యూష నటించింది. ఇంకా అనేక టీవీ ధారావాహిక కార్యక్రమాల్లో నటించింది. అయితే వ్యక్తిగత కారణాలతో 2002లో కోకోకోలాలో విషం కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకుంది. కానీ ప్రత్యూష తల్లి మాత్రం తన కూతురుది ఆత్మహత్య కాదు.. హత్య అని అంటున్నారు. ఇందులో నిజమేంటో ఎవరికీ తెలీదు..

5.సౌందర్య – 31 ఏళ్లు

తెలుగు సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్ర తర్వాత అంతటి పేరును సంపాదించుకున్న వారిలో సౌందర్య ఒకరు. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తద్వారా ఎన్నో అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. 2004లో ఎన్నికల సమయంలో ఓ రాజకీయ పార్టీకి తన వంతు మద్దతుగా ప్రచారం చేయడానికి వెళ్లిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో తుదిశ్వాస విడిచింది. సౌందర్యతో పాటు వెళ్లిన తన అన్న కూడా మరణించాడు. 

6.కునాల్ – 30 ఏళ్లు

ప్రేమికుల రోజు సినిమాతో అందరికీ దగ్గరయ్యాడు కునాల్.. అయితే ఆ సినిమా హిట్ తర్వాత కునాల్ సినిమాలు సరిగ్గా ఆడలేదు. కొన్ని సినిమాలు ఆడినప్పటికీ అతనికి సినిమా అవకాశాలు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక అసిస్టెంట్ ఎడిటర్ గా చేశాడు. తర్వాత కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా చేశాడు. అయితే తీవ్రంగా పెరిగిపోయిన అప్పుల వల్ల ఏం చేయాలో తెలియర ఫిబ్రవరి 7, 2008లో ముంబైలోని తన అపార్ట్మెంట్ లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

7.భార్గవి – 25 ఏళ్లు

అష్టా చమ్మా సినిమాలో నానికి చెల్లెలిగా నలించింది భార్గవి.. అయితే 2008 డిసెంబర్ 16న హైదరాబాద్, బంజారాహిల్స్ లోని తన ఇంట్లో తన భర్త ప్రవీణ్ చేతిలో హత్యకు గురైంది. భార్గవి చనిపోయిన తర్వాత ప్రవీణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 

8.యశో సాగర్

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు యశోసాగర్.. అయితే 2012లో తన తదుపరి సినిమా షూటింగ్ కి వెళ్తుండగా కారు ప్రమాదంలో చనిపోయాడు. 

9.ఉదయ్ కిరణ్ – 33 ఏళ్లు

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా మారాడు ఉదయ్ కిరణ్. ఒకప్పుడు చేతి నిండా సినిమాలు, సూపర్ హిట్స్, డబ్బులు, స్నేహితులతో హ్యాపీగా ఉన్న ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు తగ్గి ఆర్థికంగా చితికిపోవడం వల్ల 2014లో తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. టాలీవుడ్ అతిపెద్ద విషాదాలలో ఉదయ్ కిరణ్ మరణం కూడా ఒకటి. 

10.విజయ్ సాయి – 38 ఏళ్లు

అమ్మాయిలు అబ్బాయిలు సహా ఎన్నో కామెడీ సినిమాల్లో నటించాడు విజయ్ సాయి.. అయితే వ్యక్తిగత సమస్యల కారణంగా 2017 డిసెంబర్ 11న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. 

11.జియా ఖాన్ – 25 ఏళ్లు

నిశబ్ద్, గజినీ(హిందీ), హౌస్ ఫుల్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది జియాఖాన్.. అయితే ప్రేమించిన వ్యక్తితో గొడవల కారణంగా 2013లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

12.ఆర్తి అగర్వాల్ – 31 ఏళ్లు

తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరితో నటించింది ఆర్తి అగర్వాల్.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టారు. 2015లో లైపోసెక్షన్ ఆపరేషన్ జరిగినప్పుడు అనారోగ్యంతో ఆమె చనిపోయారు.

13.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – 34 ఏళ్లు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. అయితే డిప్రెషన్ కారనంగా 2020 జూన్ 14న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుశాంత్ మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 

  1. సిద్ధార్థ్ శుక్లా – 40 ఏళ్లు

ప్రముఖ బాలీవుడ్ టెలివిజన్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ శుక్లా హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. సిద్ధార్థ్ ఫిట్ నెస్ కోసం ప్రాణమిస్తాడు. జిట్ చేసిన తర్వాత గుండెపోటు రావడంతో కేవలం 40 ఏళ్ల వయసులోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఎప్పుడూ ఫిట్ గా కనిపించే సిద్ధార్థ్ శుక్లాకు గుండెపోటు రావడం అనేది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

15.పునీత్ రాజ్ కుమార్ – 46 ఏళ్లు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి వెళ్లేసరికి పునీత్ పరిస్థితి విషయమించింది. 2021 అక్టోబర్ 29న గుండెపోటు కారణంగా పునీత్ ప్రాణాలు కోల్పోయారు. కేవలం 46 ఏళ్ల వయసులో పునీత్ తిరిగి రానీ లోకాలకు వెళ్లడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

వీరే కాకుండా సుత్తి వీరభద్రరావు, రాజబాబు, ఫటాఫట్ జయలక్ష్మీ, శ్రీహరి, రఘువరణ్, ఇష్టం సినిమా హీరో చరణ్ కూడా చిన్నవయస్సులోనే మరణించారు. 

 

Leave a Comment