5 ఏళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు రేప్..!

సమాజంలో అత్యాచారాలు ఎక్కవ అవుతున్నాయి. వయస్సుతో తేడా లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. 5 ఏళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన యూపీలోని ఫతేపూర్ జిల్లా ఖాగా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. 

ఐదేళ్ల బాలిక శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన ఇంటి ముందు ఆడుకుంటుంది. ఆ బాలికను 13 ఏళ్ల బాలుడు నిర్మానూష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఇంటికి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. స్థానిక పెద్దలు ఈ ఘటనపై రాజీ కుదుర్చాలని చేశారు. 

కానీ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై అత్యాచార ఆరోపణలు ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Leave a Comment