కొత్త పథకం.. పెళ్లి చేసుకుంటే రూ.4 లక్షలు..!

జపాన్.. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశం.. అభివృద్ధి గురించి, కష్టించి పని చేసే ప్రజలు గురించి ఎవరు మాట్లాడినా జపాన్ దేశాన్ని ఆదర్శంగా చెబుతారు. కానీ ఇదే వారికి కష్టాల్లో పడేసింది. జపాన్ లో ప్రతి ఏటా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. అక్కడి ప్రజల్లో వైవాహిక బంధం, భార్య భర్తల ఏకాంతం తగ్గిపోయింది. దీంతో జననాలపై ప్రభావం పడింది.

గత 25 సంవత్సరాలుగా జపాన్ లో వయస్సు మళ్లిన వారి సంఖ్య పెరిగిపోయింది. యువతలో సంతానోత్పత్తి శాతం దారునంగా పడిపోవడంతో దిగ్భ్రాంతికర పరిణామాలకు దారితీస్తుంది. సంతానలేమి, మరనాల్లో తరుగుదల శాతం, వృద్ధుల సంఖ్య పెరుగుదల ఇవన్నీ జాతీయ ఉత్పాదకతపై ప్రభావం చూపుతున్నాయి. 

దీనిని అరికట్టేందుకు జపాన్ ప్రభుత్వం సరి కొత్త ప్రథకాన్ని తీసుకొచ్చింది. దేశంలో జననాల రేటు పెంచేందుకు యువ జంటలకు నగదు బహుమతి ఆఫర్ చేసింది. పెళ్లి చేసుకున్న జంటకు రూ.4 లక్షలు అందించాలని నిర్ణయించింది. చాలా మంది ఆదాయ వేటలో పడి పెళ్లి అనే మాటను మర్చిపోతున్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచి పెళ్లి చేసుకునే జంటలకు రూ.4 లక్షలు ఇస్తామని ప్రకటించింది. దీని వల్ల దేశంలో మళ్లీ జననాల రేటు పెరుగుతుందని భావిస్తోంది..   

Leave a Comment