దేవుడికి నైవేద్యంగా నాలుక కోసుకున్నాడు..!

భక్తి పారవశ్యంలో ఓ యువకుడు పిచ్చి పని చేశాడు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆత్మారాం(22) అనే యువకుడు తన నాలుకను కోసుకొని దేవుడికి నైవేద్యంగా అర్పించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాబేరు ప్రాంతంలోని భాటి అనే గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. నాలుగ తెగడంతో తీవ్ర రక్తస్రావమైంది. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు చెప్పారు. 

అయితే తన కొడుకు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉన్నాడని ఆత్మారాం తండ్రి రామ్ సింగ్ చెప్పాడు. నాలుక అర్పిస్తే మంచి జరుగుతుందని తన కొడుకును కొందరు తప్పుదోవ పట్టించినట్లు రామ్ సింగ్ పేర్కొన్నాడు. 

 

  

 

Leave a Comment