పౌరసత్వం నిరూపించుకోవాలంటూ 127 మందికి నోటీసులు

దేశవ్యాప్తంగా సీఏఏపై ఆందోళనలు జరుగుతున్న సమయంలో… భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UDAI) మీ పౌరసత్వం నిరూపించుకోవాలంటూ 127 మంది హైదరాబాదీలకు నోటీసులు జారీ చేసింది. అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20 లోగా విచారణకు రావాలని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోలేకపోయినా వారి ఆధార్ కర్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది. సత్తార్ ఖానే అనే ఆటో డ్రైవర్ హైదరాబాద్లో నివసిస్తున్నాడు. నకిలీ ధ్రవపత్రాలతో ఆధార్ కార్డు అందుకున్నావన్న ఫిర్యాదు మేరకు ఉడాయ్ ఫిబ్రవరి 3న అతనికి నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం కలిగిఉంటే తగిన పత్రాలు చూపించాలని నోటీసులో పేర్కొంది. సరైన పత్రాలు చూపకపోయినా, ఈనెల 20 లోగా విచారన అధికారి ముందుకు హాజరు కాకపోయినా చర్యలు తప్పవని హెచ్చిరించింది. ఒక వేళ భారతీయులు కాకపోతే, దేశంలోకి చట్టబద్ధంగానే ప్రవేశించామని నిరూపించుకోవాలని తెలిపింది. లేనిపోతే దీనిని సుమోటోగా తీసుకుని ఆధార్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉడాయ్ కు పౌరసత్వంపై ప్రశ్నించే హక్కు లేదంటూ విమర్శలు రావడంతో సదరు అధికారులు స్పందించారు. కొంత మంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆదార్ కార్డులు పొందారంటూ పోలీసులు ఇచ్చిన సమచారం మేరకు 127 మందికి నోటీససులు పంపించామని వివరణ ఇచ్చారు. 

Leave a Comment