జగన్ కీలక నిర్ణయాలకు బ్రేక్..

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పటు మరింత ఆలస్యం కానుంది. 2021 మార్చి  తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. జవవరి 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు ఇప్పుడున్న పరిధుల్లో ఎలాంటి మార్పులు చేపట్టవద్దని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 2021 జనాభా లెక్కల్లో భాగంగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ తో పాటు ఎన్పీఆర్ ను అప్డట్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త జిల్లలాను ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయం పెండింగ్ లో పడనుంది. 

అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 25కి పెంచుతామని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని వైసీపీ మేనిఫస్టోలో పెట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాల  పునర్విబజన ఏడాదిలో పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాని తరువాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించింది. కానీ 2026 తర్వాతే మిగతా రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 

Leave a Comment