సోనూసూద్ ను కలిసేందుకు 1200 కి.మీ. సైకిల్ యాత్ర..!

కరోనా కష్ట కాలంలో సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన చేసిన సేవతో రియల్ హీరోగా ఎదిగారు. భారతదేశం అంతటా ప్రజలకు అవిశ్రాంతంగా సహాయం చేస్తున్న ఈ నటుడుకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సోనూసూద్ ను కలిసిందేకు తన అభిమానులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల కొందరు అభిమానులు పాదయాత్రగా ముంబైకి సోనూసూద్ ను కలుసుకున్నారు. తాజాగా ఓ అభిమాని సోనూసూద్ ని కలవడానికి పూరీ నుంచి 1200 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. ఎట్టకేలకు సోనూ ఇంటికి చేరుకున్న సింబా అనే అభిమాని సోనూసూద్ ను కలుసుకున్నాడు. సోనూసూద్ కు పూల దండను వేసే ప్రయత్నం చేయగా సోనూ ఆ దండను ఆ అభిమానికే వేశాడు. అనంతరం ఆ అభిమానితో కాసేపు మాట్లాడారు.   

Leave a Comment