ఆషాఢం సారె : 10 మేకపోతులు.. 50 కోళ్లు.. టన్నుల కొద్ది చేపలు..!

తెలుగు సంప్రదాయం ప్రకారం ఆడపిల్లల తరఫువారు ఆషాఢంలో వియ్యంకుడి ఇంటికి సారె పంపడం సంప్రదాయం.. ఎవరి స్తోమత మేరకు వారు పంపించుకుంటారు. ఈనేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యాపారవేత్త సారె కింద భారీ కానుకలే పంపించాడు. 10 మేకపోతులు, 50 రకాల స్వీట్లు, కోళ్లు, చేపలు అబ్బో ఇప్పటివరకూ ఎవరూ వినని, చూడని సారె పంపారు. 

యానాంలో ఓ మోటార్ సైకిల్ షోరూం యజమాని తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు రాజమహేంద్రవరానికి చెందిన వ్యాపారవేత్త బత్తుల రామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి ఇటీవల వివాహం జరిగింది. ప్రస్తుతం ఆషాడ మాసం కావడంతో కొత్తగా పెళ్లయిన అమ్మాయి ఇంటి నుంచి అత్తవారింటికి సారె పంపించడం గోదావరి జిల్లాల్లో ఆనవాయితీ..

ఈ నేపథ్యంలో అమ్మాయి తల్లిదండ్రులు రాజమండ్రి నుంచి యానాంకు భారీ సారె పంపించారు. వారు పంపిన సారెలో ఏకంగా 10 మేకపోతులు, 50 పందెం కోళ్లు, టన్నుల చొప్పున కొరమేను, పండుగప్ప, బొచ్చే చేప, 250 కిలలో బొమ్మిడాయిలు, 250 కిలోల కిరాణతో పాటు, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్లతో పాటు ఆడపిల్లకు పెట్టాల్సిన సరంజామా మొత్తాన్ని పెద్ద ఎత్తున పంపించారు. ఈ సారెను చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.    

 

Leave a Comment