పదేళ్ల బాలుడికి వింత వ్యాధి.. ఎంత తిన్నా ఆకలి తీరడం లేదట..!

పదేళ్ల బాలుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు.. ఎంత తిన్నా ఆకలి తీరడం లేదట. ఆ బాలుడికి ఎంత తినప్పటికీ ఇంకా తినాలి అనిపిస్తుందట.. సింగపూర్ కి చెందిన పదేళ్ల బాలుడు డేవిడ్ సూ ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.. ఈ వ్యాధి పేరు ప్రేడర్ విల్లీ సిండ్రోమ్.. 

ఎంత తిన్నా కూడా కడుపు నిండకపోవడం, ఆకలి తీరకపోవడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం.. ఇది ఒక జన్యుపరమైన సమస్య.. ఈ వ్యాధికి కారణం క్రోమోజన్ 15లోని కొన్ని జీన్స్ సరిగ్గా పనిచేయకపోవడం.. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స లేదు. దీంతో డేవిడ్ తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఈ వ్యాధి ఎటువంటి పరిస్థితులకు దారితీస్తోందని భయపడుతున్నారు. 

కొడుకు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆ తల్లిదండ్రులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు.. డేవిడ్ బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇష్టమైనట్లు తినకుండా కిచెన్ రూమ్ కి తాళం వేస్తున్నారు. ఓ షెడ్యూల్ ప్రకారం డేవిడ్ కి తిండి పెడుతున్నారు. అంతేకాదు డేవిడ్ కూడా ఈ షెడ్యూల్ కి కట్టబడి ఉండేలా చూస్తున్నారు. 

Leave a Comment