తెలంగాణలో ఉద్యోగాల జాతర.. జిల్లాల వారీగా ఖాళీలు ఇవే..!

తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో మొత్తం 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో 80,039 పోస్టులకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన 11,103 పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు వెల్లడించారు. 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామన్నారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ అన్నారు. స్థానికేతరులకు 5 శాతం మాత్రమే వస్తాయని పేర్కొన్నారు. ఇక అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని కూడా కేసీఆర్ పెంచారు. ఓసీ అభ్యర్థులకు గరిష్టంగా 44 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 సంవత్సరాలుగా నిర్ణయించారు. దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 54 ఏళ్లకు, ఎక్స్ సర్వీస్ మెన్లకు 47 ఏళ్లకు పెంచారు. 

శాఖల వారీగా ఖాళీలు:

హోంశాఖ – 18,334

పాఠశాల విద్యాశాఖ – 13,086

వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ – 12,755

ఉన్నత విద్యాశాఖ-7,878

బీసీ సంక్షేమశాఖ-4,311

రెవెన్యూ శాఖ-3,560

ఎస్సీ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ – 2,879

నీటి పారుదల-కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ – 2,692

గిరిజన సంక్షేమ శాఖ – 2,399

మైనార్టీ సంక్షేమ శాఖ- 1,825 

అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ – 1598

పంచాయతీ రాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖ-1455

కార్మిక-ఉపాధి కల్పన శాఖ – 1221

ఆర్థిక శాఖ-1146

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ – 895

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ – 859

వ్యవసాయ-సహకార – 801

ట్రాన్స్ పోర్ట్-ఆర్అండ్ బీ శాఖ – 563

న్యాయ శాఖ – 386

పశుసంవర్థక, మత్స్యశాఖ – 353

సాధారణ పరిపాలన శాఖ – 343

పరిశ్రమలు – వాణిజ్య శాఖ – 233

యువజన సర్వీసులు-పర్యాటక-సాంస్కృతిక శాఖ – 184

ప్రణాళిక శాఖ – 136

పౌరసరఫరాల శాఖ – 106

లెజిస్లేచర్ – 25

ఎనర్జీ – 16

మొత్తం పోస్టులు – 80,039 

జిల్లాల వారీగా ఖాళీలు

హైదరాబాద్ – 5268

నిజామాబాద్ – 1976

మేడ్చల్ మల్కాజ్ గిరి – 1769

రంగారెడ్డి – 1561

కరీంనగర్ – 1465

నల్లగొండ – 1398

కామారెడ్డి – 1340

ఖమ్మం – 1340

భద్రాద్రి కొత్త గూడెం-1316

నాగర్ కర్నూల్ – 1257

సంగారెడ్డి – 1243

మహబూబ్ నగర్ – 1213

ఆదిలాబాద్ – 1193

సిద్దిపేట – 1178

మహబూబాబాద్ – 1172

హనుమకొండ – 1157

మెదక్ – 1149

జగిత్యాల – 1063

మంచిర్యాల – 1025

యాదాద్రి భువనగిరి – 1010

జయశంకర్ భూపాలపల్లి – 918

నిర్మల్ – 876

వరంగల్ – 842

కుమ్రం భీం ఆసీఫాబాద్ – 825

పెద్దపల్లి – 800

జనగాం – 760

నారాయణపేట్ – 741

వికారాబాద్ – 738

సూర్యాపేట – 719

ములుగు – 696

జోగులాంబ గద్వాల – 662

రాజన్న సిరిసిల్లా – 601

వనపర్తి – 556

Leave a Comment