ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు.. సెన్సోడైన్ టూత్ పేస్ట్ కు భారీ జరిమానా..!

సెన్సోడైన్ టూత్ పేస్ట్ పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) భారీ జరిమానా విధించింది. టీవీలో ప్రసారం అయ్యే సెన్సోడైన్ టూత్ పేస్ట్ యాడ్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ యాడ్ ని ఏడు రోజుల్లో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి యాడ్ వేసినందుకు సెన్సోడైన్ టూత్ పేస్ట్ కంపెనీపై రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

సెన్సోడైన్ టూత్ పేస్ట్ కంపెనీ తమ ప్రొడక్ట్స్ ప్రచారం కోసం ఒక యాడ్ చేసింది. అందులో ‘ప్రపంచవ్యాప్తంగా దంతవైద్యులు సిఫార్స్ చేస్తున్న టూత్ పేస్ట్ సెన్సోడైన్.. ప్రపంచ నంబర్ 1 సెన్సిటివటీ టూత్ పేస్ట్’ అని ఈ యాడ్ చెబుతోంది. ఈ వ్యాఖ్యలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

టీవీ, యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ తో సహా ఇతర సోషల్ మీడియాలో వచ్చిన సెన్సోడైన్ యాడ్ పై సీసీపీఏ సుమోటోగా చర్యలు తీసుకుంది. ఈ టూత్ పేస్ట్ పై ప్రపంచవ్యాప్తంగా సర్వే జరిపినట్లు కంపెనీ ఎటువంటి వివరాలను సమర్పించలేదు. కేవలం ఇండియాలోని దంతవైద్యులను సర్వే చేసి ప్రకటన చేసింది. ఈ యాడ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దంతవైద్యులు సిఫార్స్ చేస్తున్నట్లు చూపించింది. ఇలా చూపించడం సరికాదని సీసీపీఏ పేర్కొంది. ఈ యాడ్ ని ఏడు రోజుల్లో తొలగించాలని ఆదేశించింది. 

Leave a Comment