మహిళా ఎస్సై మానవత్వం.. ఎండలో 3 కి.మీ. శవాన్ని మోస్తూ..!

ఎర్రటి ఎండలో గుర్తుతెలియని శవాన్ని 3 కిలోమీటర్లు మోసి మానవత్వం చాటుకున్నారు మహిళా ఎస్సై.. ఈ ఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో సోమవారం జరిగింది. హాజీపురం రెవెన్యూ ఫారెస్ట్ లో సుమారు 65 ఏళ్లు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న ఎస్సై కృష్ణపావని, సీఐ పాపారావు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఫారెస్ట్ కావడంతో రోడ్డుపై తుప్పలు పెరిగి ఉన్నాయి. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు వాహనం కూడా వెళ్లలేని స్థితిలో రోడ్డు ఉంది. దీంతో కానిస్టేబుల్ సాయంతో ఎస్సై కృష్ణపావని మృతదేహాన్ని ఓ కర్రకు కట్టి 3 కిలోమీటర్ల దూరం రోడ్డు వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి కనిగిరి ఆస్పత్రికి తరలించారు. మహిళా ఎస్సై శవాన్ని మోస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment