బరువు పెంచే 10 చెడ్డ అలవాట్లు.. మీకు ఇవి ఉన్నాయా?

ఈరోజుల్లో అధిక బరువు సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరిగిన తర్వాత తగ్గించేందుకు డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఊబకాయం అనేది ఎందువల్ల వస్తుందనే దానిపై ఎవరూ అంతగా శ్రద్ధ తీసుకోరు. ఇప్పుడు ఊబకాయం పెంచే 10 అలవాట్ల గురించి తెలుసుకుందాం.. 

1.టీవీ చూస్తూ తినడం:

టీవీ చూస్తూ తినడం వల్ల ఎంత తింటున్నాం.. ఏం తింటున్నాం.. అనే దానిపై శ్రద్ధ చూపరు. టీవీ చూస్తూ తినడం వల్ల తరుచుగా అతిగా తింటారు. దీని వల్ల బరువు పెరుగుతారు. రోజుకు రెండు గంటలకు మించి టీవీ చూడటం వల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు 20 శాతం పెరుగుతాయి. అంతేకాదు టీవీ సీరియల్స్ లో వచ్చే ఏమోషన్ సన్నివేశాలతో గుండె మరియు రక్తపోటుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.. టీవీ చూసే సమయంలో మధ్యమధ్యలో జాగింగ్, స్ట్రెచింగ్, బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. 

2.చాలా సేపు ఆకలితో ఉండటం:

చాలా మంది హడావిడిగా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తినకుండానే వెళ్తుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆకలి వేసినా తినకుండా కడుపును ఖాళీగా ఉంచుతారు. అలా ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉన్న తర్వాత ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. దీనివల్ల ఎసిడిటీ, నీరసం మొదలైన సమస్యలు వస్తాయి. శరీరంలో చక్కెర స్థాయి తగ్గే అవకాశం ఉంటుంది. మెదడుకు సరైన సమయంలో గ్లూకోజ్ అందదు. సమయానికి ఆహారం తీసుకోవం..సరైన డైట్ ఫాలో అవ్వడం చేయాలి. 

3.వేగంగా తినడం:

ఆహారాన్ని నమలకుండా చాలా త్వరగా తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు. అంతేకాదు కడుపు నిండిందా లేదా అనే సమాచారం కూడా మెదడుకు ఆలస్యంగా చేరుతుంది. అందువల్ల అవసరమైన దానికంటే ఎక్కువగా తింటారు. జీర్ణశక్తి తగ్గుతుంది. కడుపు నొప్పి కూడా రావచ్చు. వేగంగా కాకుండా ఆకలిని బట్టి పరిమిత పరిమాణంలోనే తినడం మంచిది. భోజనం చేసేటప్పుడు వేరే పని చేయకూడదు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ ఆకలిగా అనిపిస్తే పండ్లు లేదా మంచి స్నాక్స్ తీసుకోవాలి.

4.అల్పాహారం తీసుకోకపోవడం:

అల్పాహారం తీసుకోకపోవడం.. డిన్నర్ మరియు బ్రేక్ ఫాస్ట్ మధ్య 8-12 గంటల గ్యాప్ మెదడు మరియు కండరాలను బలహీనపరుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం లేదా ఒక కప్పు టీ లేదా కాఫీ మాత్రమే తాగడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణశక్తి బలహీనపడుతుంది. కేలరీలు తగ్గడానికి బదులు పెరుగుతాయి. ఇలా చేయడం వల్ల రక్త హీనత కూడా రావచ్చు. శరీరంలో శక్తి తగ్గుతుంది. అందుకోసం ఆరోగ్యకరమైన అల్పాహారం ఉండేలా చూసుకోవాలి. రోజులోని ఇతర భోజనాలతో పోలిస్తే అల్పాహారంలో ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. 

5.తగినంత నిద్ర లేకపోవడం:

తగినంత నిద్ర లేకపోవం కూడా అధిక బరువుకు కారణమవుతుంది. రాత్రిపూట తిన్న ఆహారం కూడా జీర్ణం కాదు. శరీరంలో శక్తి తగ్గుతుంది. డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకోసం సరైన సమయంలో పనులు ముగించుకుని సమయానికి నిద్రపోవాలి. ప్రతిరోజరూ 7-8 గంటల నిద్రపోయేలా చూసుకోవాలి. 

6.ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం:

అధిక బరువు పెరగడానికి ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం కూడా ఒక ప్రధాన కారణం.. ఫాస్ట్ ఫుడ్ లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం రావచ్చు. వారానికి ఒకసారి మాత్రమే ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. 

7.తిన్న వెంటనే నిద్రపోవడం:

తిన్న వెంటనే నిద్రపోవడం, రాత్రి ఆలస్యంగా తినడం, అతిగా తినడం కూడా అధిక బరువు పెరిగేందుకు కారణం. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం కాకుండా శరీరంలో కొవ్వు పెరుగుతుంది. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాక గ్యాస్ సమస్య తలెత్తుతుంది. భోజనం చేసిన వెంటనే కొద్ది సేపు నడవడం వల్ల ఆహారం జీర్ణం అవుతుంది. తిన్న తర్వాత తేలికపాటి వ్యాయామం చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

8.ఒత్తిడి:

ఒత్తిడికి గురైనప్పుడు కోపంలో ఎక్కువ ఆహారం తీసుకోవడం కూడా అధిక బరువుకు కారణం అవుతుంది. ఒత్తిడి వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మరియు గ్యాస్ట్రోఎంటెరిటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో కోపాన్ని వదిలేసి శాంతంగా భోజనం చేయాలి.

9.ఆల్కహాల్:

ఆల్కహాల్ తీసుకోవడం కూడా అధిక బరువుకు కారణమవుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అధిక కేలరీలు వచ్చి చేరతాయి. లివర్ ఇన్ఫెక్షన్, గుండెపోటు, మెదడు సంబంధిత వ్యాధులు రావచ్చు.

10.రోజంతా కూర్చొని పనిచేయడం:

ఆఫీస్ లో నిరంతరాయంగా రోజంతా కూర్చొని పనిచేయడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గుండె జబ్బులు రావచ్చు. అధిక బరువు కారణంగా వెన్నుముక బలహీనంగా మారుతుంది. కాబట్టి పని మధ్యలో 2-3 సార్లు కాఫీ తాగడం లేదా బాత్రూమ్ కి వెళ్లడం వంటి సాకుతో మీ శరీరాన్ని రిలాక్స్ చేయండి. లిఫ్ట్ కి బదులు మెట్లను వాడండి. ఫోన్ లో మాట్లాడేటప్పుడు నడవడం లాంటి చేయండి.. 

Leave a Comment