ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది శిశులు మృతి.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..!

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. భండారా జిల్లా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించడంతో 10 మంది శిశువులు మృతి చెందారు. భండారా జిల్లాలోని ఆస్పత్రి న్యూ బోర్న్ కేర్ యూనిట్ (ఎన్సీయూ) లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఎన్సీయూలో మొత్తం 17 మంది చిన్నారులు ఉన్నారు. వారిలో ఏడుగురిని రక్షించగలిగారు. మిగితా 10 మంది చిన్నారులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

కాగా, ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. మొదట పొగలు రావడాన్ని గమనించిన నర్సు, మిగితా సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇచ్చింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..

మహారాష్ట్రలో అప్పుడే పుట్టిన 10 మంది శిశువులు సజీవ దహనం అవడంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సర్కారు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. 

 

Leave a Comment