ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు సినీ నటి శ్రీ రాపాక. ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘నగ్నం’ సినిమా ద్వారా తన అందాలతో సంచనలనం రేపారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించనప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ హాట్ బ్యూటీ ఏపీ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు. సీఎం జగన్ అవకాశమిస్తే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతానని చెప్పారు.
సీఎం జగన్ యువ, రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు, కొత్త వాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం ఇస్తున్నార్నారు. తాను పదేళ్లుగా సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు. రాజకీయాల్లోకి వస్తే.. ఇంకా ఎన్నో సేవలు చేయగలనని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే తపనను, ఉత్సాహాన్ని చూసి సీఎం జగన్ గారు నాకు సీటు ఇస్తే.. గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుస్తాని అన్నారు. గోపాలపురం ప్రజలకు అందుబాటులో ఉంటి.. ప్రజా సేవ చేయాలని ఉంది. నా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను అమలు చేసి అభివృద్ధి చేయాలని ఉందని శ్రీ రాపాక తెలిపారు.
సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, భారీ మెజారిటీత గెలిచి జగన్ కు కానుకగా అందిస్తానని తెలిపారు. సీఎం జగన గెలిచి సీఎం పదవిని మళ్లీ చేపట్టాలని కోరుకుంటున్నానని శ్రీ రాపాక చెప్పారు.