వీటితో బీకేర్ ఫుల్.. ప్రాణాలకే ప్రమాదం..  

ప్రతి ఇంట్లో ఎలుకలు ఉండటం సాధారణం.. ఇంట్లో వస్తువులను, ఫుడ్ ఐటమ్స్ ని తింటూ ఇబ్బంది పెడుతుంటాయి.. అయితే ఎలుకలను మనం తేలిగ్గా  తీసుకుంటాము.. అయితే ఈ ఎలుకలతో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాారు వైద్యులు.. ఎందుకంటే ఎలుకలతో అనేక వ్యాధులు వ్యాపస్తాయి. ఎలుకల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రాణాంతకం కావచ్చని చెబుతున్నారు.. ఈ వ్యాధులు ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు.  ఎలుకల ద్వారా వ్యాపించే వ్యాధులు ఏవో ఇప్పుడు చూద్దాం.. 

లెప్టోస్పిరోసిస్ : ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.  ఈ ఇన్ఫెక్షన్ జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాంతులు వంటి లక్షణాలు కలిస్తుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ ద్వారా కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వైఫల్యం లేదా మరణం సంభవించవచ్చు. 

 

ప్లేగు వ్యాధి: ఎలుకలు కాలు వేయడం ద్వారా ప్లేగు వ్యాధి వ్యాపిస్తుంది. దీని ద్వారా జ్వరం, అలసట, చెమట వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో ఈ ప్లేగు మరణానికి దారి తీస్తుది. 

 

క్షయ : క్షయ వ్యాధి అనేది ఎలుకల మలం లేదా మూత్రంతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఒక అంటు వ్యాధి. ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ద్వారా దగ్గు, అలసట, బరువుతగ్గడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

వైరల్ హెమరేజిక్ ఫీవర్: వైరల్ హెమరేజిక్ ఫీవర్ అనేది ఎలుకల కాలు ద్వారా వ్యాపిస్తుంది. దీని ద్వారా జ్వరం, రక్తస్రావం, అవయవ నష్టం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

కలరా: కలరా అనేది కలుషితమైన ఆహారం లేదా నీటిి వినియోగం ద్వారా వ్యాపిస్తుంది. దీని ద్వారా విరేచనాలు, కడుపు తిమ్మిరి, మంట వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది మరణానికి దారి తీస్తుంది.

నివారణ: 

  • ఇల్లు మరియు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • ఇంట్లో ఎలుకలు రాకుండా చూసుకోవాలి. అవి కుట్టకుండా, తిరగకుండా నిరోధించుకోవాలి.
  • ఎలుకల వల్ల ఏదైనా వ్యాధిి సోకిందని భావిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

 

 

Leave a Comment