‘వైల్డ్ డాగ్’గా నాగ్

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతకు ముందు నాగ్ మన్మథుడు -2 సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సారి వైల్డ్ డాగ్ గా వస్తున్నాడు. యథార్థ ఘటనల స్ఫూర్తితో వస్తున్న వైల్డ్ డాగ్ లో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్గా నటిస్తున్నాడు. ఈ సనిమాను అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాకు యాక్షన్ ఎపిసోడ్స్ కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. నాగ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రం హైదారాబాద్ లోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ లలో 2008లో జరిగిన జంట పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’కు పని చేసిన డేవిడ్ ఇస్మాలోన్ ‘వైల్డ్ డాగ్‘ కు యాక్షన్ డైరెక్టర్ గా పనిచేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a Comment