మీ ఫోన్ లో కాలింగ్ సమస్య ఉందా..అయితే ఇలా చేయండి..

ప్రస్తుత మసయంలో వాయిస్ కాల్స్ సమస్య అందిరినీ వేధిస్తోంది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్ల దగ్గరే ఉండటంతో స్మార్ట్ ఫోన్ విపరీతంగా ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం వాయిస్ కాల్స్ యొక్క లోడ్ బాగా పెరిగిపోయింది. దీని కారణంగా వాయిస్ కాల్స్ డ్రాప్స్ సమస్యలు వస్తున్నాయి. 

WiFi Calling

వై ఫై కాలింగ్ తో వాయిస్ కాల్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మీ సమస్యకు కస్టమర్ కేర్ సెంటర్ కాల్ చేసి ఫిర్యాదు చేయకుండానే వై ఫై కాలింగ్ ద్వారా హ్యీపీగా మాట్లాడుకోవచ్చు. వై ఫై కాలింగ్ కోసం మీ వద్దనున్న వై ఫై కనెక్షన్ ను ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. దీని కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. 

వైఫై కాలింగ్ తో ప్రయోజనాలు..

వైఫై కాలింగ్ ను ఉపయోగించడం వల్ల నెట్ వర్క్ లేకపోయినా వాయిస్ కాల్స్ ను చేసుకోవచ్చు. దీని కోసం అదనపు యాప్ అవసరం లేదు. మారుమూల ప్రాంతాల్లో, సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా వైఫై కాలింగ్ సహాయపడుతుంది. 

ఉపయోగించడం ఎలా?

వైఫై కాలింగ్ ను ప్రస్తుతానికి ఎయిర్ టెల్ మరియు జియో వినియోగదారులు మాత్రమే ఉపయోగించగలరు. దీని కోసం ఎయిర్ టెల్ లేదా జియో యాక్టివ్ సిమ్ ఉండాలి. వైఫై కాలింగ్ కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్ ఫోన్ కు వైఫై నెట్ వర్క్ కు కనెక్ట్ చేయాలి. దీని కోసం మీ మొబైల్ నెంబర్ ఏదైనా యాక్టివ్ వాయిస్ ప్లాన్ తో యాక్టివ్ లో ఉండాలి. మీ సిమ్ 4జి కి సెట్, VoLTE ఆన్ చేయబడిందని నిర్ధారించుకోండి. 

ఆండ్రాయిడ్ ఫోన్ లో ఎలా యాక్టివ్ చేయాలి..

  • మీ స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్ లను ఓపెన్ చేయాలి.
  • అందులో కనెక్షన్ మీద నొక్కండి.
  • వైఫై కాలింగ్ ను ఎంపిక చేయండి. టోగుల్ ఆన్ చేయండి. 

ఐఫోన్ లో ఎలా యాక్టివ్ చేయాలి..

  • మొదటగా సెట్టింగులను ఓపెన్ చేయాలి.
  • ఫోన్ ఎంపికకు వెళ్లండి.
  • అందులో వైఫై కాలింగ్ ఎంచుకోండి. మరియు టోగుల్ ఆన్ చేయండి.

Leave a Comment