మరి కొన్నేళ్లలో ఈ నగరాలు మునిగిపోతాయట..!

వాతావరణ మార్పులపై గ్లాస్కో వేదిక జరిగిన సదస్సులో ప్రపంచ నేతలు పాల్గొని కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా చర్యలు ముమ్మరం చేయాలని నిర్ణయించారు. వాతావరణ వేడికెక్కుతున్న ప్రస్తుత పోకడ కొనసాగితే ఈ శతాబ్దం ముగిసేనాటికి వాతావరణం 3 నుంచి 5 సెంటీగ్రేడ్ పెరగవచ్చని డబ్లుఎన్ఓ చెబుతోంది. గతంతో పోలిస్తే వాతావరణంలో మార్పులు గణనీయంగా చోటుచేసుకున్నాయి. అందుకే అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు.. ఈక్రమంలో సముద్ర మట్టాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంతాలు, వ్యవసాయ పంటలకు పెనుముప్పు తప్పదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధ్యయనంలో పేర్కొంది.

ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లయిమేట్ ఛేంజ్(ఐపీసీసీ) నివేేదికలో భయంకర విషయాలు బయటపడ్డాయి. ఉష్ణోగ్రతల ప్రభావంలో సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంత నగరాలకు ముప్పు వాటిల్లుతుందని అధ్యయనం తెలిపింది. భారత్ లోనూ తీర ప్రాంత ముప్పు పొంచి ఉందని, 30 నగరాలు ప్రభావితం కానున్నాయని తెలిపింది. ముఖ్యంగా 12 సముద్ర తీర ప్రాంతాలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.  

ప్రస్తుత వాతావరణ మార్పులు, సముద్రమట్టం పెరుగుదల ఇలానే కొనసాగితే.. రెండు దశాబ్దాల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబాయి 1.90 అడుగుల మేర సముద్రంలో మునిగిపోతుందని ఐపీసీసీ నివేదిక వెల్లడించింది. అదేవిధంగా చెన్నై 1.87 అడుగులు, గుజరాత్ లోని భావ్ నగర్ 2.70 అడుగులు, కర్ణాటకలోని మంగళూరు 1.87 అడుగులు, గోవాలోని మార్మ్ గావ్ 2.06 అడుగులు, తమిళనాడులోని ట్యూటికోరిన్ 1.90 అడుగులు, పశ్చిమ బెంగాల్ లోని కిదిర్ పూర్ 0.49 అడుగులు, ఒడిశాలోని పారాదీప్ 1.93 అడుగులు, గుజరాత్ లోని ఒకా 1.96 అడుగులు, ఏపీలోని విశాఖపట్నం 1.77 అడుగులు, గుజరాత్ లోని కుండ్లా 1.87 అడుగులు సముద్రంలో మునిగిపోతాయని అంచనా వేస్తున్నారు. విచ్చలవిడిగా కర్బన ఉద్గారాల వినియోగం పర్యావరణానికి చేటు కలిగిస్తోంది. అది అంతటి ఆగిపోదని, వాతావరణ మార్పులకు కారణమవుతున్న మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని ఐపీసీసీ నివేదిక వెల్లడించింది.    

Leave a Comment