కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

కరోనాతో కలిసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాని, సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసులు సున్నాకు వచ్చే వరకు వ్యవస్థ తరవకపోతే ఇబ్బందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, మాజీ ఆర్బీ గవర్నర్ రఘురామ్ రాజన్ లాంటి వారు అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. కరోనాతో సహజీవనం తప్పదని డబ్య్లుహెచ్ ఓనే చెబుతోందన్నారు.

చంద్రబాబు పక్క రాష్ట్రంలో కూర్చొని విమర్శలు చేస్తున్నారని, ఆపద సమయంలో టీడీపీ నేతలు ఎవరూ సేవా కార్యక్రమాలు చేయరని విమర్శించారు. చంద్రబాబుకు ఒక స్థిరమైన ఆలోచన ఉండదన్నారు. టీడీపీ సిద్ధాంతం కూడా అదే రీతిలో ఉంటుందన్నారు.

సీఎం జగన్ కరోనాను సైంటిఫిక్ గా, మెడికల్ గా ఎదుర్కొనేందుకు ఒక స్టాండ్ పై ఉన్నారని, ప్రజలకు ధైర్యం ఇస్తున్నారని బుగ్గన తెలిపారు. ఏపీలో 5.34 కోట్ల జనాభా ఉందని, ఇప్పటికీ 1,02,460 పరీక్షలు చేశామని అన్నారు. ప్రతి పది లక్షల మందిలో 1919 పరీక్షలు చేసి దేశంలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రము ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్నారని విమర్శించారు. 

దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల శాతం 4.12 శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసుల శాతం 1.4 శాతం గా ఉందన్నారు. ఇక మరణాల రేటు దేశంలో 3.17గా ఉంటే ఏపీలో 2.4గా ఉందన్నారు. రాష్ట్రంలో సరైన రీతిలో వైద్యం అందుతుందని, అందుకు మరణాల సంఖ్య తక్కవగా ఉందని అన్నారు. 

ఇక హై రిస్క్ జిల్లాలుగా కృష్ణా,గుంటూరు,కర్నూలు ఉన్నాయన్నారు. కర్నూలులో పాజిటివిటీ రేటు 4.8, గుంటూరులో 3.03, కృష్ణాలో 3.24 గా ఉందని తెలిపారు. తక్కువ రిస్క్ ఉన్న జిల్లాల్లో తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం ఉన్నాయన్నారు. 

 

Leave a Comment