వరంగల్ లో అంతుచిక్కని వ్యాధి.. 4 వేల కోళ్లు మృతి..!

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో అంతుచిక్కని వ్యాధితో 4 వేల కోళ్లు మృత్యువాతపడ్డ ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని మడిపెల్లి శివారు హరిశ్చంద్రతండాలో ఓ వ్యక్తి పౌల్ట్రీపామ్ నిర్వహిస్తున్నాడు. పౌల్ట్రీపామ్ లో గత కొద్ది రోజుల నుంచి పది వేలకు పైగా కోళ్లను పెంచుతున్నాడు. 

ఈక్రమంలో మూడురోజులుగా అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృతి చెందుతున్నాయి. రోజుకు వెయ్యి కోళ్లు చనిపోతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు వేల కోళ్ల మృతి చెందాయి. మరో ఇంకొన్ని రోజుల్లో పామ్ లోని మిగితా కోళ్లు కూడా చనిపోతాయని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కోళ్ల మృతితో లక్షల రూపాయల నష్టం వచ్చినట్లు వాపోయాడు. 

  

 

Leave a Comment