ఎమ్మెల్యే అవమానించారని వాలంటీర్ ఆత్మహత్యాయత్నం..!

వైసీపీ ఎమ్మెల్యే దుర్బాషలాడారని ఓ గ్రామవాలంటీర్ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో గ్రామానికి చెందిన వాలంటీర్ పి.సువర్ణ జ్యోతిని దుర్బాషలాడారు. 

దీంతో ఆమె తీవ్ర అవమానంతో కుంగిపోయింది. మనస్తాపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను చికిత్స కోసం రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహిళ వాలంటీర్ పట్ల ఎమ్మెల్యే ప్రవర్తనపై స్థానికులు మండిపడుతున్నారు. మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టడంపై మండిపడుతున్నారు. అయితే వాలంటీర్ ను తాను దూషించలేదని ఎమ్మెల్యే చెబుతున్నారు.  

 

Leave a Comment