‘మీ అందరిపైనా కోపం వస్తోంది’.. మోడీ, బైడెన్, జాన్సన్ ల ముందు భారత బాలిక..!

వాతావరణ మార్పులపై గ్లాస్గోలో కాప్-26 సదుస్సు జరిగింది. ఈ సదస్సులో తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల టీనేజ్ బాలిక వినీశా ఉమాశంకర్ ప్రసంగించింది. ఎకో అస్కార్ అవార్డులుగా భావించే ఎర్త్ షాట్ ప్రైజ్ ఫైనలిస్ట్ అయిన వినీశా కాప్ ఇతర పర్యావరణ పరిరక్షకులతో కలిసి ప్రిన్స్ విలియమ్ కోరిక మేరకు సదస్సులో మాట్లాడింది. ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని జాన్సన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ల సమక్షంలో ధైర్యంగా ప్రసంగించింది. ఆమే స్పీచ్ కి ప్రపంచ దేశాధినేతలు ఫిదా అయ్యారు.

భూమి ఉష్ణోగ్రతలను తగ్గించడానికి కొత్త ఆలోచనలు చేయాలని వినీశా దేశాధినేతలను కోరింది. ఇక మీరు మాటలు ఆపి చేతలు మొదలు పెట్టాలని చెప్పింది. వాతావరణ మార్పుపై మీరు ఏమీ చేయకపోతే ఎర్త్ షాట్ ప్రైజ్ విజేతలు, ఫైనలిస్టులు చర్యలు తీసుకుంటారని పర్కొంది. తమ వద్ద ఎన్నో వినూత్న ప్రాజెక్టులు, పరిష్కార మార్గాలు ఉన్నాయని చెప్పింది. మీరు ఇస్తున్న వాగ్దానాలతో తమ తరం విసిగిపోయిందని, మీ అందరిపైనా కోపం వస్తోందని వినీశా దేశాధినేతల ముందు చెప్పింది.

తాను కేవలం భారతదేశ అమ్మాయిని మాత్రమే కాదు.. ఈ పుడమి పుత్రికను అని, అలా చెప్పుకోవడానికి గర్విస్తానని వినీశఆ చెప్పింది. భూమిని కాపాడుకోవడానికి పాత పద్ధతులను వదిలి.. కొత్త ఆలోచనలు చేసే తమకు మద్దతుగా నిలవాలని, మీ సమయాన్ని, డబ్బులను తమపై వెచ్చించాలని, తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాడానికి మద్దతు ఇవ్వాలని కోరింది. ఆమె ప్రసంగానికి సభ మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. 

 

Leave a Comment