మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే మీకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు..!

చాలా మంది ఇల్లు అందంగా ఉండటం కోసం రకరకాల వస్తువులతో అలంకరించుకుంటారు. మంచి సీనరీలు, దేవుడి బొమ్మలు, అంమైన పువ్వులు వంటి వస్తువులను ఇంట్లో అందంగా పెట్టుకుంటారు. స్థోమతను బట్టి ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటారు. అలా ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు.. కానీ ఇంట్లో పెట్టకూడని వస్తువుల గురించి అంతగా పట్టించుకోరు. అయితే ఇల్లు అందంగా ఉండాలని కనిపించిన ప్రతి వస్తువులను తెచ్చిపెడితే ఇబ్బందులు తెచ్చకున్నట్టే అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాంటి వస్తువులు ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం వల్ల కుటుంబ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మనీ ఇంట్లో ఏ వస్తువులు పెట్టకూడదు? వాటి వల్ల వచ్చే సమస్యలేంటీ? అనే దాని గురించి తెలుసుకుందాం..

ఇంట్లో ఉంచకూడని వస్తువులు:

  • ఇంట్లో విరిగిపోయిన, పగలిపోయిన బొమ్మలు ఉంచుకోవద్దు.. తమకు ఇష్టముందనో లేక గిఫ్ట్ ఇచ్చారనో అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అలాంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో సమస్యలు రెట్టింపు అవుతాయి. ఇంట్లో తరచూ గొడవలు, మానసిక అశాంతి వంటి సమస్యలు తలెత్తుతాయి. 
  • ఇంట్లో లీకవుతున్న నల్లాలు ఉండకూడదు. దీని వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. సంపాధించిన డబ్బులు నిల్వ ఉండదు. వ్యాపారంలో అనుకోని నష్టాలు సంభవిస్తాయి. అందుకే కిచెన్ లో గానీ, బాత్ రూమ్ లో కాని ఇలా ఎక్కడైనా ఇంట్లో నల్లాలు లీక్ అవుతుంటే వెంటనే మార్చండి.. 
  • చాలా మందికి ఇంట్లో చిన్న పిల్లల ఫొటోలు పెట్టుకోవడం అలవాటు. ముద్దు వస్తున్నారని ఇంట్లో గోడలకు పిల్లల ఫొటోలు పెట్టుకుంటారు. నవ్వుతున్న ఫొటోలు పెట్టుకుంటే పర్వాలేదు. కానీ ఏడ్చే పిల్లల ఫొటోలు మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. దీని వల్ల ఆడవాళ్లు తరుచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. 
  • కొంత మంది సీనరీ బాగుందని మునిగిపోతున్న పడవల ఫొటోలు పెట్టుకుంటారు. కానీ మునిగిపోయే పడవలు ఉండే ఫొటోలు కానీ, బొమ్మలు కానీ ఇంట్లో ఉండకూడదు. అలాంటివి ఉంటే ఇంట్లో కుటుంబ సమస్యలు ఎక్కవ అవుతాయి. 
  • ముఖ్యంగా ఇంట్లో ఆగిపోయిన, పాడైపోయిన, పగిలిపోయిన గడియారాలు, పగిలిపోయిన అద్దాలు ఉండకూడదు. ఒకవేళ అలాంటివి ఉంటే వెంటనే తీసేయండి.. లేదా రిపేర్ చేయించండి. ఇలా పనిచేయని గడియారాలు ఇంట్లో ఉంటే జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. 
  • పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు.  అలాంటి ఫొటోలు చాలా రోజులుగా ఉండి, దేవుడి రూపం కూడా కనిపించనంతగా మారిపోయి ఉండకూడదు. అలాంటి పటాలను పూజ గదిలో పెట్టుకోవడం మంచిది కాదు. కొంతమంది విరిగిపోయిన దేవుడి విగ్రహాలను పూజ గదిలో ఉంచి పూజిస్తుంటారు. అలా చేయడం కూడా మంచిది కాదు. పాత దేవుని పటాలు, విగ్రహాలు ఉంటే వాటిని దగ్గరలో ఉన్న ఆలయంలో గానీ, పారే నదిలో గాని వేస్తే సరిపోతుంది. 
  • ఇంట్లో క్రూరమృగాలు, యుద్ధ సన్నివేశాలు ఉన్న ఫొటోలు ఉండకూడదు. వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పాసవుతుంది. ఇంట్లో అశాంతి తలెత్తుతుంది. వీటికి బదులుగా అందంగా ఉండే పువ్వులు, నేచర్ గ్రీన్ సీనరీ, వాటర్ ఫాల్స్ వంటి చిత్రపటాలు, బుద్ధుని బొమ్మలు పెట్టుకోవడం కూడా మంచిది. వీటి వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్, లేదా గాజు సీసాల్లో మనీ ప్లాంట్స్ లాంటి మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇల్లు అందంగా, కంటికి ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a Comment