‘వకీల్ సాబ్’ ఫిక్స్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథనాయకుడిగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీఎస్.పీకే 26 సినిమాను బోనికపూర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే టైటిక్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఇది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ మూవీ రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ మే 15న రిలీజ్ కానుంది. పింక్ మూవీలో అమితాబ్ పోషించిన పాత్రను ఈ సినిమాలో  పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హిరోయిన్లు నటించనున్నారు. నివేద థామస్, అంజలి మరియు అనన్యా నాగల్లా ప్రధాన పాత్ర పోషించనున్నారు. గత కొద్ది రోజుల ముందు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. 

అయితే ఈ సినిమా టైటిల్ ఫైనల్ అవుతదా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే వకీల్ సాబ్ అనే టైటిల్ వైపే పవన్ సహా అందదరూ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

పవన్ ఫ్యాన్స్ లోకి వకీల్ సాబ్ అనే టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే దానికి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కొద్ది రోజుల్లోనే ప్రకటన వెలువడుతుంది. మార్చి తొలివారంలో దిల్ రాజు అండ్ టీమ్ వరుసగా ప్రచారంలో హోరెత్తించబోతుంది. 

ముందుగా మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా తొలి సింగిల్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ 50 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలిసింది. ఆయన రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా..సినిమాలకు కొంత సమయం కేటాయిస్తున్నారు.

Leave a Comment