స్థానిక ఉత్పత్తులనే వాడండి : మోడీ

ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. లాక్ డౌన్ పై ఏమైనా మాట్లాడతారా అని ఆసక్తి చూపారు. ఈ సారి మన్ కీ బాత్ లో మోడీ ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. దేశ ప్రజలంతా స్థానిక ఉత్పత్తులనే వాడాలని కోరారు. దేశం స్వయం సంవృద్ది సాధించేలా పౌరులంతా చొరవ చూపాలని పులుపునిచ్చారు.

సరిహద్దు వివాదంలో చైనా దూకుడుకు దీటుగా బదులిచ్చామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.  చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారని వారి త్యాగాలను కొనియాడారు. దేశం కోసం చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను సైన్యంలోకి పంపేందుకు సిద్దంగా ఉన్నారని, అది మన బలం అని మోడీ అన్నారు. మన దేశానికి ఇతర దేశాలతో ఎలా స్నేహం చేయాలి, అవసరమైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలుసన్నారు.

  దేశ ప్రజలు చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారని, కాని భారత్ ను శాంతియుత దేశంగా ప్రపంచం చూస్తోందని అన్నారు. భారత్ స్వావలంబన సాధించేందుకు ఇదే సమయమని, ప్రస్తుతం దేశం అన్ లాక్ దశలో ఉందని చెప్పారు. బొగ్గు, అంతరిక్షం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో మనం కలిసికట్టుగా ఇంకా అభివృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మోడీ పేర్కొన్నారు. 

ఈ ఏడాది మనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని అన్నారు. ప్రపంచమంతా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టాయని, అయితే వ్యాధినిరోధక శక్తిని పెంచేవన్నీ ఇండియాలో ఎప్పిటి నుంచో వాడుతున్నవేనని గుర్తించాలని తెలిపారు. కరోనా పెరుగుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు.    

Leave a Comment