నేడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన

న్యూ ఢిల్లీ :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ ప్రయాణించే రహదారులన్నీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించింది. అహ్మదాబాద్ లోని మొటెరా స్టేడియంలో ట్రంప్ హాజరుకానున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి రూ.85 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. రోడ్లను ఆధునీకరించడానికే రూ.30 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం ట్రంప్ ఆగ్రాలోని తాజ్ మహాల్ వద్దకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి రోడ్లన్నీ క్లీన్ చేయించారు. ట్రంప్ పర్యటనకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్‌ను తాజాగా మరోసారి ప్రకటించారు.

పర్యటన షెడ్యూల్ ఇదీ..

ఫిబ్రవరి 24న..

  • ఉదయం 11.55 గంటలకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి మొతెరా స్టేడియం వరకు భారీ ర్యాలీ జరుగుతుంది. 
  • మధ్యాహ్నం 12.30కి మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం జరుగుతుంది.
  • మధ్యాహ్నం 3.30కి ఆగ్రా వెళ్తారు. 
  • సాయంత్రం 5.10కి లో తాజ్ మహాల్ ను సందర్శిస్తారు. 
  • రాత్రి 7.30కి పాలెం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
  • మౌర్య హోటల్‌లో ట్రంప్ దంపతులు బస చేస్తారు. 

ఫిబ్రవరి 25న..

  • ఉదయం 9.55 గంటలకు ట్రంప్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. 10.45కి రాజ్‌ఘాట్‌లో నివాళులర్పిస్తారు. 
  • ఉదయం 11.25కి హైదరాబాద్‌ హౌస్‌లో మోదీ-ట్రంప్‌ ఉమ్మడి మీడియా సమావేశం జరుగుతుంది. 
  • తర్వాత ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. అనంతరం ట్రంప్‌- ప్రధాని మోదీ లంచ్
  • మధ్యాహ్నం 2.55కి అమెరికా ఎంబసీలో సిబ్బందితో ట్రంప్‌ భేటీ
  • రాత్రి 8గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు విందు
  • రాత్రి 10గంటలకు అమెరికాకు బయల్దేరనున్న ట్రంప్.

 

Leave a Comment