కాబూల్ ఎయిర్ పోర్టులో ప్రజల నరకయాతన..!

అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అక్కడి కీలక పట్టణాలన్నీ క్రమంగా ఆక్రమించుకుంటూ వచ్చి రాజధాని కాబూల్ ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ నగరం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాబూల్ విమానాశ్రయం ఒక్కటి మాత్రమే అమెరికా సైన్యం ఆధీనంలో ఉంది. 

దీంతో ఈ దేశ ప్రజలు అఫ్ఘనిస్తాన్ ను వీడేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. కాబూల్ విమానాశ్రయంలో తమ పౌరులను తీసుకెళ్లేందుకు వచ్చిన విదేశీ విమానంలోకి ఎక్కేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. విమానంలోకి వెళ్లేందుకు వేసిన ఒక మెట్ల నిచ్చేనపై చీమలదండులా వేలాడుతూ కనిపించారు. 

ఈనేపథ్యంలో గతంలో ఏ దేశంలోనూ చూడని దృశ్యాలు కనిపించాయి. సునామీ, భూకంపాలు వచ్చినప్పుడు ప్రజలు ఏవిధంగా పరుగులు తీస్తారో ఆ విధంగా ప్రజలు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేస్తున్నాయి. 

Leave a Comment