వామ్మో.. ఆమె డ్రస్ విలువ అక్షరాల రూ.37 కోట్లు..!

బాలీవుడ్ హీరోయిన్, మోడల్ ఊర్వశి రౌతెలా తన ఫోటో షూట్స్ తో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటారు. తాజాగా ఆమె ధరించి కాస్ట్యూమ్ వల్ల మరోసారి వార్తల్లో నిలిచారు. ఈమె ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రగా నటించబోతుంది. ప్రపపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ధీర వనిత అయిన క్లియోపాత్రగా నటించేందుకు ఆమె చాలా వర్కవుట్స్ చేస్తుంది. 

ఇదే సమయంలో మహారాణి పాత్ర అవ్వడంతో ఊర్వశి కోసం 5 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి డ్రెస్ ను తయారు చేశారు. 5 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.37 కోట్లు. ఆమె కాస్ట్యూమ్ ను బంగారంతో తయారు చేయడం విశేషం. ఈ ఖరీదైన దస్తులతో ఈమె  తాజాగా జరిగిన అరబ్ ఫ్యాషన్ వీక్ షోలో పాల్గొన్నారు. 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్ గా ఈమె ధరించిన డ్రెస్ కు గుర్తింపు దక్కింది. అంతే కాదు అరబ్ ఫాషన్ వీక్ షొలో టాపర్ గా నిలిచిన తొలి ఇండియణ్ గా ఊర్వశి నిలిచారు. అంతే కాదు ఈ డ్రెస్ లోనే ఊర్వశిపై ఒక షార్ట్ ఫిల్మ్ ను కూడా చిత్రీకరించారు. ఊర్వశి రౌతెలా గతంలో కూడా దాదాపు 60 లక్షల రూపాయల విలువ చేసే లెహంగాను ధరించి బాలీవుడ్ స్టార్ నేహా కక్కర్ వివాహ వేడుకల్లో పాల్గొంది. 

Leave a Comment