కొత్త సంవత్సరంలో  భూమి పైకి  ఏలియన్స్ రాక..!

ఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలొ కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైనవారని, వారే గ్రహాంతర వాసులు అంటూ ఉంటారు. మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనిషి పంపిన ఏ సందేశానికీ ఏలియన్స్ ఇప్పటివరకూ జవాబు ఇవ్వలేదు. అనంత విశ్వంలో జీవం ఉన్న గ్రహాలు అనేకం ఉండే ఉంటాయి.

మనలాంటి బుద్ధి జీవులు కూడా ఉండే ఉంటారు. రేపో మాపో వారితో మనకు మాటా ముచ్చట కూడా జరగవచ్చు. వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాలు ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తాల నమ్మకం.యూఫాలజీ  అనగా “ఎగిరే పళ్ళెములు” గురించి తెలిపే శాస్త్రం అని అర్దం. ఈ శాస్త్రంపై చాలా సంవత్సరాల నుండి వివిధ దేశాల శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు,కొన్ని రహస్యబృందాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. UFOlogy అనే పదం UFO+logy అనే రెండు పదాల నుండి ఉత్పన్నమయింది. ఈ రెండు పదాలు గ్రీకుభాష నుండి గ్రహించబడినవి.

అసలు గ్రహాంతరవాసుల కోసం మన అన్వేషణ ఇప్పటిదేం కాదు.. ఎప్పట్నుంచో వారి కోసం వెతుకుతున్నాం. అప్పుడప్పుడు మనకు తారసపడుతున్న యుఎఫ్‌వోలు గ్రహాంతరవాసులపై మరింత ఆసక్తిని రేపుతున్నాయి. మొన్నటికి మొన్న అంటే న్యూ ఇయర్‌ రోజున ఏలియన్స్‌కు సంబంధించిన ఓ యుఎఫ్‌ఓ భూమ్మీదకు వచ్చిందట. ఇప్పుడిదే విషయం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆ వీడియో చూసిన వారంతా.. ఏంటది అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకెళితే.. తాజాగా అమెరికాలోని సెయింట్‌ ఆల్బన్స్‌లో మూడు లైట్లతో కూడిన ఓ యూఎఫ్ఓ గాల్లో చక్కర్లు కొట్టింది అని ఆ అమెరికన్లు అంటున్నారు .త్రిభుజాకారంలో ఉన్న ఈ యుఎఫ్ఓ లైట్లు మిణుకు మిణుకు మంటూ మెరుస్తూ కదిలాయి. సరిగ్గా న్యూ ఇయర్‌ రోజు రాత్రి 12 గంటల  సమయంలో ఇది కనిపించింది. సెయింట్ ఆల్బన్స్‌లోని ఓ వ్యక్తికి ఈ దృశ్యం కనిపించిందట. అయితే, ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ అంతా అతని ఇంటి పెరట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏలియన్స్ భూమిపై న్యూఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చి ఉంటారని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఈ వీడియో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేస్తున్నారు. కావాలనే క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారంటూ విమర్శలు చేస్తున్నారు.

 

Leave a Comment