పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు..!

అమ్మాయిల మధ్య స్నేహం ఎలా ఉన్నా పెళ్లి మాత్రం అబ్బాయిలతోనే జరుగుతుంది. ఇదే జరగాలి కూడా.. అయితే జార్ఖండ్ లో ఇద్దరు అమ్మాయిలు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. ఏంజరిగిందంటే.. జార్ఖండ్ రాష్ట్రం కొదెర్మ జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఇంట్లో వారికి ఈ విషయం చెబితే ఒప్పుకోరని భావించారు. దీంతో ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. నవంబర్ 8న గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వారి ఇళ్లకు ఆరు కిలోమీటర్ల దూరంలోని చంద్రచౌక్ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు అక్కడికి చేరుకుని గొడవ చేశారు. ఇద్దరు అమ్మాయిలు మేజర్లు కావడం వల్ల పోలీసులు జోక్యం చేసుకోలేదు. 

 

Leave a Comment