ఇది రైలు కాదు.. స్కూలు.. ఎక్కడో తెలుసా..!

చిన్న పిల్లలకు రైలు ఎక్కడమంటే మహా ఇష్టం.. కానీ చాలా మంది చిన్నారులు పేదరికం వల్ల రైలులో ప్రయాణించలేకపోతున్నారు. అలాంటి వారి కోసం తమిళనాడులోని పుదుక్కొట్టయి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం వినూత్న ఆలోచన చేసింది. పాఠశాలకు ట్రైన్ రూపంలో పెయింటింగ్ వేయించింది. ట్రైన్ కంపార్ట్ మెంట్ లాగా స్కూలు వరండాను తీర్చిదిద్దారు.

ఈ పాఠశాలకు పేద విద్యార్థులు, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా వస్తారు. వారు రైలులో ప్రయాణించలేరు. పాఠశాలపై ఈ బొమ్మలు విద్యార్థులకు ట్రైన్ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రైలులోని భాగాలు ఎలా ఉంటాయో విద్యార్థులు తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

Leave a Comment