‘పవన్ కళ్యాణ్ కు రాబిస్ వ్యాక్సిన్ వేయాలి’.. నాగబాబు, పేర్ని నాని మధ్య ట్విట్టర్ వార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. సినిమా విడుదల, టికెట్ల ధరలకు సంబంధించి పెను దుమారం రేగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ అధికార పార్టీ నాయకులంతా వకీల్ సాబ్ సినిమాపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏపీ రవాణ శాఖ మంత్రిపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు..

నాగాబాబు ట్వీట్టర్ వేదికగా ఏమన్నారంటే.. ‘మీకు ఏమైంది నాని గారు. మీరు కరోనా వ్యాక్సిన్ తో పాటు రాబిస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రాబిస్ వ్యాక్సిన్ టు మిస్టర్ నాని. స్టేట్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్. వ్యాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ’ అంటూ నాగబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయితే నాగబాబు చేసిన ట్వీట్ కు పేర్ని నాని రీట్వీట్ చేస్తూ.. ‘పరోపకారి పాపన్న నాగబాబు గారు, పేర్ని నాని లాంటి బయటి వారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వ్యాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి.. ఆలస్యమైతే మీకు కూడా అవసరమవుతుంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు’ అంటూ చెప్పుకొచ్చారు. 

 

Leave a Comment