మాంగళ్య దోషం.. 13 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకున్న టీచర్..!

ఓ ట్యూషన్ టీచర్ తన జాతకంలో మాంగళ్య దోషం ఉందని 13 ఏళ్ల స్టూడెంట్ ను పెళ్లాడింది. ఈ ఘటన పంజాబ్ లోని జలంధర్ లో జరగింది. బస్తీ బావా ఖేల్ ప్రాంతంలో ఓ యువతి ట్యూషన్ టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చేస్తున్నా అవి కుదరడం లేదు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను పుజారి వద్దకు తీసుకెళ్లగా.. ఆమెకు మాంగళ్య దోషం ఉందని చెప్పాడు. దీని నివారణకు ముందుగా మైనర్ బాలుడితో ఆమె పెళ్లి చేయాలన్నాడు.

ఈక్రమంలో ఆమె వద్ద ట్యూషన్ కు వచ్చే 13 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. బాగా చదవట్లేదని, తన వద్ద వారం ఉంచుకొని భయం చెప్తానని బాలుడి తల్లిదండ్రులను ఒప్పంచింది. వారం రోజులు విద్యార్థిని టీచర్ తన ఇంట్లో పెట్టుకొని పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత బాలుడిని ఇంటికి పంపించింది. అయితే జరిగిన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మహిళ ఒత్తిడి చేయడంతో తర్వాత వారు కేసును వెనక్కి తీసుకున్నారు. 

Leave a Comment