చిక్కుల్లో పడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..!

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుల్లో పడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె ఓటు వేయడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఇటీవల నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటు వేసిన ఆమె మళ్లీ జీహెచ్ఎంసీలో ఎలా ఓటువేస్తారని ప్రశ్నించింది. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘంకు లేఖ రాసింది. ఒక చోట ఓటు హక్కు ఉండి మరో చోట ఎలా ఓటు వేస్తారని, వెంటనే కవితను డిస్ క్వాలిఫై చేయాలని కోరింది.

టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కూడా ఈ అంశంపై అభ్యంతరం తెలిపారు. నిజామాబాద్ జిల్లా నవీ పేట మండలం పోతంగల్ లో ఓటు హక్కు ఉండి బంజరాహిల్స్ లో ఓటు వేడయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఓటు హక్కు తొలగించిన తర్వాత ఇక్కడ ఓటు వేస్తే బాగుండేదని, దొంగ ఓటు వేసిన కవితకు ఎమ్మెల్సీగా కొనసాగే హక్కు లేదని పేర్కొన్నారు. 

Leave a Comment