ఈ చిట్కాలతో గ్యాస్ సమస్య ఇక ఉండదు..!

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య గ్యాస్.. మనల్ని వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యలో గ్యాస్ ట్రబుల్ ప్రధానమైంది. ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, నిరంతరం ఆలోచనలు, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తోంది. 

గ్యాస్ ట్రబుల్ కు కారణాలేంటీ?

  • కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం..
  • టీ, కాఫీ అధికంగా సేవించడం.
  • సరైన వేళకు ఆహారం తీసుకోకపోవడం.
  • ఒత్తిడి, అలసట.
  • మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం.
  • మానసిక ఆందోళనలు, దిగులు, కుంగుబాటుకు లోనుకావడం వంటి మానసిక కారణాలు.
  • ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం.
  • జీర్ణకోశంలో ఇన్ ఫెక్షన్లు మొదలైనవి గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణాలు..
  • మలబద్ధకం, వివిధ వ్యాధులకు వాడే మందులు, మధుమేహం, ఐబీఎస్ వంటి కొన్న వ్యాధుల వల్ల ప్రేగుల కదలికల్లో మార్పులు జరగడం, హార్మోన్ల అస్వవ్యస్థత తదితర కారణాలు కూడా గ్యాస్ సమస్యను కలిగిస్తాయి.

లక్షణాలు ఏంటీ?

  • కడుపు ఉబ్బరంగా ఉండి కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం.
  • ఆకలి లేకపోవడం, అన్నం హితవు లేకపోవడం, ఛాతిలో మంట, తేన్పులు ఎక్కువగా రావడం.
  • ఆహారం జీర్ణం కాక కడుపునొప్పి రావడం. మలబద్ధకం ఏర్పడటం.
  • అపాన వాయువు ఎక్కువగా పోతుండటం.
  • జీర్ణాశయంలో పుండు ఏర్పడి కడుపులో మంటతో కూడిన నొప్పిరావడం. 

గ్యాస్ సమస్యకు ఇలా చెక్ పెట్టిండి:

అయితే గ్యాస్ ట్రబుల్ తో బాధపడేవారు కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను దూరంలో చేసుకోవచ్చు. ఈ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్లు:

గ్యాస్ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు మంచి మందు అనే చెప్పాలి. ఇందులో అసాధారణ ప్రోటీన్లు ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లను తాగడం  అలవాటు చేసుకుంటే మంచిది. 

కొత్తిమీర:

అజీర్తి నిర్మూలనుకు కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒకగ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.  

నిమ్మరసం:

గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమనానికి నిమ్మరసం ఎంతో మేలు. ఒక కప్పు ఉప్పుతో నిమ్మరసం, అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి తాగాలి. ఈ రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. 

అల్లం:

గ్యాస్ సమస్యకు మంచి మందు అల్లం.దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. తిన్నగా నమలలేకపోతే చక్కెర కలుపుకుని తినొచ్చు. 

వెల్లుల్లి:

గ్యాస్ సమస్యకు వెల్లుల్లి చాలా చక్కటి సహజసిద్ధమైన మందు. దీనిని తిన్నగా నమిలాలి. లేదా వెల్లుల్లి ముక్కలు, కొత్తమీర విత్తనాలు, జీలకర్ర తీసుకుని ఐదు నిమిషాలపాటు నీళ్లలో ఉడికించాలి. ఈ ద్రావణాన్ని తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. 

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూస్ తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. 

నల్ల మిరియాలు:

మిరియాలను పాలలో కలిపి తాగితే గ్యాస్ సమస్య తీరుతుంది. 

ఇంగువ:

ఒక గ్లాస్ లో వేడినీటిని తీసుకుని, అందులో ఇంగువ వేసుకుని బాగా కలిపి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య, కడుపు నొప్పి, అజీర్తి తగ్గిపోతాయి. 

ఇంకొన్ని నివారణ చర్యలు:

  • వేళకు ఆహారం తీసుకోవాలి. మసాలాలు, వేపుళ్లు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, టీ, కాఫీలు మానేయాలి. 
  • నిల్వ ఉంచిన పచ్చళ్లు తినడం మానేయాలి. 
  • నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
  • తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. 
  • వ్యాయామం చేయాలి. 
  • తినే ఆహారాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని బాగా నమలి మింగడం వల్ల ఈ ఇబ్బందిని అధికమించవచ్చు. 
  • కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, చూయింగ్ గమ్ నగలడం వల్ల కూడా కడుపులో గ్యాస్ పెరుగుతుంది. 

Leave a Comment