తమిళనాడులో పామును కూర చేసుకుని తిన్న ముగ్గురి అరెస్ట్..!

ఇంట్లో వచ్చిన పాము చంపి కూర వండుకుని తిన్నారు. దీంతో పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.. తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు తంగామముని పట్టణానికి చెందిన శివకుమార్ ఇంట్లో పాము వచ్చింది. దీంతో శివకుమార్ తన స్నేహితులు హుస్సేన్, సురేస్ లతో కలిసి పామును పట్టుకున్నాడు. 

ఆ ముగ్గురు కలిసి పామున చంపి ముక్కలుగా చేస కూర వండుకున్నారు. ఆ తర్వాత దానిని ఎంచక్కా తిన్నారు. పైగా కూర వండుకుని తిన్న వీడియోను తమ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ కూడా చేశారు. ఈ విషయం పోలీసుల వరకు చేరింది. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై మేట్టూరు అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.  

You might also like
Leave A Reply

Your email address will not be published.