లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉంది : ప్రధాని మోడీ

కరోనా వైరస్ వ్యాప్తని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 14 తరువాత ఒకేసారి ఆంక్షలు ఎత్తివేయడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేేశారు. లాక్ డౌన్ ను పొడిగించాలని పలు రాష్ట్రాల నుంచి వస్తునన సూచనల మేరకు బుధవారం అన్ని పార్టీల నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదిస్తామన్నారు. అయితే ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయం సాధ్యం కాదన్నారు. 

కోవిడ్-19 తర్వాత పరిస్థితులు మళ్లీ ఒకేలా ఉండవన్నారు. రాబోయే కాలంలో ప్రీ కరోనా మరియు పోస్ట్ కరోనా అన్నట్లు ఉంటుందని పీఎం అన్నారు. సామాజిక మరియు వ్యక్తిగత మార్పులు జరగాల్సి ఉంటుందని తెలిపారు. 

కరోనా వైరస్ ను నివారించడానికి ప్రధాని దేశంలో లాక్ డౌన్ విధించారు. అది ఏప్రిల్ 14తో ముగుస్తుంది. అయితే దీనిని విస్తరించాలా వద్ద అనే దానిపై పీఎం మోడీ ఈ వారం నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి ముందు శనివారం అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రులతో ఆయన రెండో సారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. 

వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందడం వల్ల లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉండటంతో పలు రాష్ట్రాలు మరియు నిపుణులు లాక్ డౌన్ పొడిగించాలని సూచించారు. 

అయితే పాఠశాలలు, కళాశాలలు మరియు మతపరమైన కేంద్రాలు మరి కొన్ని వారాలు మూసివేయాలని మంత్రుల యూనిట్ మంగళవారం సూచించింది.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ కు చెందిన గులాం నబీ ఆజాద్, త్రుణముల్ కాంగ్రెస్ నాయకుడు సుదీప్ బండియోపాధ్యాయ, శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఉన్నారు.  

Leave a Comment