వాట్సాప్ ‘త్రీ రెడ్ టిక్స్’ వైరల్ మెసేజ్ ఫేక్ 

వాట్సాప్ లో చాలా మంది వార్తలు మరియు ఇతర సమాచారాలు షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇతర సామాజిక మాధ్యమాల్లో మాదిరిగా తప్పుడు సమాచారం మురియు నకిలీ వార్తలు ఈ చాట్ యాప్ లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల తప్పుడు వాట్సాప్ మెసేజ్ లను ప్రభుత్వం గుర్తిస్తుందంటూ ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. వాట్సాప్ లో పంపిన మెసేజ్ లో టిక్ ల సంఖ్య మరియు దాని రంగులను బట్టి మెసేజ్ లను ప్రభుత్వం గమిస్తున్నట్లు ఒక వైరల్ మెసేజ్ చక్కర్లు కొట్టింది. ఈ సమాచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) త్రోసిపుచ్చింది.

సోషల్ మీడియాలో వాట్సాప్ సమాచారాన్ని ప్రభుత్వం గమనిస్తుందని వస్తున్న వార్తలు ఫేక్ అని పీఐబీ తేల్చి చెప్పింది. ప్రభుత్వం అలాంటి పని చేయడం లేదని, ఇలాంటి పుకార్లతో జాగ్రత్త అని ట్వట్టర్ లో పేర్కొంది.

ఈ వైరల్ మెసేజ్ లో ఏముందంటే..

 వాట్సాప్ ఒక కొత్త వ్యవస్థను రూపొందించిందని, దీంతో వినియోగదారులు పంపే సందేశాలను ప్రభుత్వం గమనిస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు. అలాంటి మెసేజ్ లకు ఎక్కువ టిక్ మార్కులు మరియు రంగులు వస్తే ప్రభుత్వం గుర్తిస్తుందని సంకేతం..

  • మూడు నీలి రంగు టిక్స్ – ప్రభుత్వం గమనించింది.
  • రెండు నీలం మరియు ఒక రెడ్ టిక్ – పంపిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు.
  • ఇక నీలం మరియు రెండు ఎరుపు టిక్స్ – పంపిన వారి డేటాను ప్రభుత్వం పరక్షిస్తోంది.
  • మూడు ఎర్ర టిక్స్ – ప్రభుత్వం చర్యను ప్రారంభించింది మరియు పంపిన వారు కోర్డు నుంచి సమన్లు స్వీకరిస్తారు.

ఇలా ఒక ఫేక్ మెసేజ్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. అయితే దీనిపై పీఐబీ ఒక ట్విట్ చేసింది. ఇది నకిలీ మరియు ప్రభుత్వం అలాంటి చర్యలు ఏమీ చేయలేదు…వాట్సాప్ మెసేజింగ్ యాప్ లో పంపే సందేశాలను చదవలేదు. అలాగే వాట్సాప్ అనేది కుటుంబం మరియు స్నేహితులతో టచ్ లో ఉండేదుకు మంచి యాప్. అయితే ఇందులో ముఖ్యమైన సందేశాలు పంపించుకోవడం అంతా సేఫ్ కాదు అని ట్విట్ చేసింది. 

వాట్సాప్ లో ఇలాంటి పుకార్లు రావడం ఇదే మొదటిసారి కాదు. అయితే వాట్సాప్ తప్పుడు సమాచారం యొక్క వ్యాప్తిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్
ఇటీవల ఫార్వార్డ్ చేసిన సందేశాల పరిమితిని ఒకేసారి ఒక చాల్ కు తగ్గించింది. ఇంతకుముందు ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కవ ఫార్వార్డ్ చేసే వీలుండేది. 

 

Leave a Comment